Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొహమ్మద్ అమీర్ అలాంటి పని చేసివుండడు..!: ఫ్యామిలీ

Webdunia
PTI
యావత్తు క్రికెట్ ప్రపంచానికి షాకిచ్చిన ఇంగ్లాండ్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ త్రయం సల్మాన్ భట్, అమీర్, ఆసిఫ్‌లపై యావత్తు క్రికెట్ అభిమానులు కోపంతో ఉన్నప్పటికీ, వారి కుటుంబాలు వారిని వెనకేసుకొస్తున్నాయి. అలాగే పీసీబీ సైతం వారిని ఈ వివాదం నుంచి గట్టెక్కించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తోంది.

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో జరిగిన "స్పాట్ ఫిక్సింగ్"లో పాలుపంచుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ పేస్ బౌలర్ మొహమ్మద్ అమీర్‌‍కు ఆతని కుటుంబం అండగా నిలిచింది. క్రికెట్ అభిమానులు, యావత్తు క్రికెట్ ప్రపంచం మొహమ్మద్ అమీర్, ఆసిఫ్, సల్మాన్ భట్‌లపై గుర్రుగా ఉన్నప్పటికీ, అమీర్ కుటుంబ సభ్యులు మాత్రం అతడు ఏ తప్పు చేయలేదంటున్నారు.

ఇంకా ఎన్నో కష్టాల మధ్య సూపర్ బౌలర్‌గా ఎదిగిన అమీర్‌, ఇలాంటి పనులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒడిగట్టబోడని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అమీర్‌పై అంతర్జాతీయ క్రికెట్ బోర్డు నిషేధం విధించడం బాధాకరమేనని అమీర్ అన్న, సోదరి అన్నారు. ఇంకా అమీర్ స్పాట్ ఫిక్సింగ్ పాల్పడ్డాడనటం అవాస్తవమని వారు కొట్టిపారేశారు.

మరోవైపు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ త్రయం సల్మాన్ భట్, అమీర్, ఆసిఫ్‌లపై ఐసీసీ నిషేధం వేటు వేయడం పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మండిపడుతోంది. అలాగే ఐసీసీ అవినీతి నిరోధక విభాగం నిర్వహిస్తున్న దర్యాప్తులో తమ క్రికెటర్లు ఎలాంటి తప్పు చేయలేదని తేలితే, ఐసీసీపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పీసీబీ హెచ్చరిస్తోంది.

ఇంకా ఐసీసీ అవార్డు జాబితా నుంచి అమీర్ పేరును తొలగించడం పట్ల బ్రిటన్‌లోని పాక్ హై కమిషనర్ వాజిద్ హసన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ క్రికెటర్లపై ఎలాంటి నేరాలు, అభియోగాలు లేకపోవడంతో లండన్ పోలీసులు విడిచిపెట్టిన తమ ఆటగాళ్లపై ఐసీసీ నిషేధం విధించడం సబబు కాదని హసన్ పేర్కొన్నారు. తమ ఆటగాళ్లు అమాయకులని వాసన్ వెనకేసుకొచ్చాడు.

ఐసీసీ అవార్డుల జాబితాలో ఎమర్జింగ్ ప్లేయర్‌గా ఎంపికైన అమీర్‌ పేరును తొలగించడం పట్ల హసన్ ఆక్రోశం వెల్లగక్కారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై విచారణ జరుగుతుంది. ఇంకా అమీర్, సల్మాన్ భట్, ఆసిఫ్‌లపై నిజా నిజాలే నిగ్గు తేలలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ అవార్డుల జాబితాలో అమీర్‌ పేరును తొలగించడం ఎంతవరకు న్యాయమని హసన్ ప్రశ్నించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య కళ్ళలో కారం చల్లాడు.. పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.. జీవితఖైదు

Maharashtra: ఫోన్ చూసుకుంటున్న తండ్రి, నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన కారు.. ఎక్కడ? (video)

195 ఎర్రచందనం దుంగల స్వాధీనం.. పోలీసులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

తిరుమల నందకం అతిథి గృహంలో దంపతుల ఆత్మహత్య.. చీరతో ఉరేసుకుని?

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

Show comments