Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిశ్రా చేతిలో సైమన్ కటిచ్ కీన్‌బౌల్డ్

Webdunia
ఢిల్లీలోని ఫెరోజ్ షా కొట్లా స్టేడియంలో జరుగుతున్న భారత్-ఆసీస్ మూడో టెస్టులో భాగంగా రెండో రోజైన శుక్రవారం భారత్ బౌలర్ల ధాటికి ఆసీస్ తడబడుతోంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 613 పరుగులు సాధించి... ఆసీస్‌పై ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే. భారత్ భారీ స్కోరుతో ఒత్తిడిలో ఉన్న ఆసీస్.. భారత్ లక్ష్యాన్ని ఛేదించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగా... శుక్రవారం ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తూ... ఓపెనర్లుగా బరిలోకి దిగిన మాథ్యూ హెడెన్, సైమన్ కటిచ్‌లు శుభారంభం చేశారు. వీరిద్దరు... మొదటి వికెట్‌కు వందకు పైచిలుకు పరుగుల భాగస్వామ్యాన్నిచ్చారు. నిలకడగా ఆడుతూ జట్టుకు పరుగులు చేకూర్చేందుకు ప్రయత్నిస్తోన్న ఈ జంటను లెగ్‌స్పిన్నర్ అమిత్ మిశ్రా విడదీశాడు.

అర్థసెంచరీ సాధించిన సైమన్ కటిచ్‌ను మిశ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనితో భారత్ జట్టు కాస్త ఊపిరి పీల్చుకుంది. 64 పరుగులు చేసి కటిచ్ అవుటవ్వగా, మాథ్యూ హెడెన్ అర్థసెంచరీ (59), ఆసీస్ సారథి రికీ పాంటింగ్ 18 పరుగులతో ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఒక వికెట్ కోల్పోయి 160 పరుగుల వద్ద కొనసాగుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula: పులివెందుల-జగన్ కంచు కోటను బద్ధలు కొట్టనున్న టీడీపీ.. ఎలాగంటే?

యాక్టర్ విజయ్‌తో భేటీ అయ్యాక.. శ్రీవారి సేవలో ప్రశాంత్ దంపతులు (video)

బ్రాహ్మణుడుని హత్య చేశారట.. కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్లిన గ్రామస్థులు (Video)

Vijayamma: ఆ విషయంలో జగన్-భారతిని నమ్మలేం.. వైఎస్ విజయమ్మ

నేను కృతి సనన్ కలిసిన ఫోటో కనబడితే మా ఇద్దరికీ లింక్ వున్నట్లా?: కిరణ్ రాయల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా తాతగారు రసికుడు.. మెగాస్టార్ కామెంట్స్.. పవన్‌ పైన వైసిపి ట్రోల్స్

కన్నడ హీరో యష్‌తో కియారా అద్వానీకి కలిసి వస్తుందా?!!

సామాన్య వ్యక్తిలా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు: జాతీయ మీడియాల్లో వక్ర చర్చలు

నా కథల ఎంపిక వెరైటీ గా ఉంటుంది : రానా దగ్గుబాటి

అమెజాన్ ప్రైమ్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్ రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి

Show comments