Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ ప్రజల ఆదర్శం: పాక్ ప్రేక్షకులకు ఆతిథ్యం!!

Webdunia
భారత ఉపఖండంలో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్‌ టోర్నీ అంతిమ ఘట్టానికి చేరుకుంది. ఈనెల 30వ తేదీన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌ తర్వాత ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలివుంటుంది. అయితే, దాయాదుల సమరానికి ఆతిథ్యం ఇస్తున్న మొహాలీ స్టేడియాన్ని భద్రతా బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి ప్రధాన కారణం.. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు ఇరు దేశాల ప్రధానమంత్రులు హాజరుకానుండటమే.

అయితే, ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు పాక్ నుంచి భారీ సంఖ్యలో ప్రేక్షకులు మొహాలీకి తరలివస్తున్నారు. పంజాబ్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు చెందిన అభిమానులు క్యూ కడుతున్నారు. వీరికి ఆతిథ్యం ఇచ్చేందుకు అవసరమైన హోటల్స్, అతిథి గృహాలు లేవు. దీంతో పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగులు ముందుకు వచ్చి పాక్ అభిమానులకు తమ ఇళ్ళలో అతిథ్యం ఇస్తామంటూ ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.

ఆ తర్వాత మొహాలీ ప్రజలు కూడా ముందుకు వచ్చి ఒక్కో ఇంటిలో ఒక్కొక్కరికి ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం మొహాలీ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. పాక్ అభిమానులకు ఆతిథ్యం ఇవ్వదలచుకున్న వారు తమ పేర్లు, చిరునామాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hot Weather Alert: తెలుగు రాష్ట్రాలకు ముప్పు.. ఎండలు దంచినా.. ఏపీకి మేఘాలు

పెన్షన్ పంపిణీ మొబైల్ అప్లికేషన్ ఇక ఉదయం 7 గంటల నుంచి పనిచేస్తుంది..

వంశీకి ఫిట్స్ - ఆస్తమా సమస్యలున్నాయ్... పనిష్మెంట్ సెల్‌లో ఉంచారు : పంకజశ్రీ

Botsa Satyanarayana: పయ్యావుల పద్దు పనికిరాదు.. బొత్స సత్యనారాయణ

గోవా బీచ్‌లో ఇడ్లీ, సాంబార్ అమ్మితే పర్యాటకులు ఎలా వస్తారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiara Advani: గుడ్ న్యూస్ చెప్పిన కియారా దంపతులు.. పాప సాక్స్ ఫోటోతో?

టీజర్ లో మించిన వినోదం మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో ఉంటుంది : చిత్ర బృందం

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి 'కన్నా నీ..' సాంగ్ రిలీజ్

Anasuya: అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నాగబంధం మూవీ

శ్రీ విష్ణు హీరోగా కోన వెంకట్, బాబీ నిర్మాతలుగా రాజమండ్రీలో తాజా చిత్రం

Show comments