Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమ్ ఇండియాకు అచ్చొచ్చిన స్టేడియం మొహాలీ!!

Mohali Cricket Stadium | PCA Stadium | History | ICC Cricket World Cup | India | Pakistan | టీమ్ ఇండియాకు అచ్చొచ్చిన స్టేడియం మొహాలీ!!
Webdunia
File
FILE
భారత ఉప ఖండంలో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీ చివరి దశకు చేరుకుంది. మరో క్వార్టర్ ఫైనల్, రెండు సెమీస్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలివున్నాయి. ఈ మ్యాచ్‌లో రెండో సెమీ ఫైనల్‌కు పంజాబ్‌ రాష్ట్రంలోని మొహాలీ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. పంజాబ్ క్రికెట్ స్టేడియాన్నే మొహాలీ స్టేడియంగా పిలుస్తారు. అత్యంత అధునాతనమైన స్టేడియం మాత్రమే కాకుండా, ప్రేక్షకులు ఎక్కువ మంది తిలకించే రెండో అతిపెద్ద స్టేడియంగా స్టేడియంగా కూడా దీనికి గుర్తింపుంది.

ఈ స్టేడియాన్ని మూడేళ్ళలో 25 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. మొహాలీ పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలిస్తుంది. 1993లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన హీరోహోండా కప్‌ నిర్వహణతో ఈ స్టేడియం వినియోగంలోకి వచ్చింది.

స్టేడియంలోని సదుపాయాలు
మొహాలీ స్టేడియంలో మొత్తం 16 ఫ్లడ్‌లైట్లు ఉంటాయి. ఇతర స్టేడియాల్లోని ఫ్లడ్‌లైట్లతో పోల్చుకుంటే అతితక్కువ ఎత్తులో ఇక్కడ ఫ్లడ్‌లైట్లు ఉంటాయి. అలాగే, స్మిమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్టు, ఇన్‌హౌస్ జిమ్నాజియు, డ్రెస్సింగ్ రూమ్ వంటి ఇతర సౌకర్యాలు ఉన్నాయి. మొహాలీ స్టేడియాన్ని 1993లో ఏర్పాటు చేశారు. మొత్తం కెపాసిటీ 45 వేలు. స్టేడియంలో బౌలింగ్ ఎండ్‌లను పెవిలియన్ ఎండ్, సిటీ ఎండ్‌ల పేరుతో పిలుస్తారు.

భారత్‌కు అచ్చొచ్చిన స్టేడియం
ఇక్కడ మొత్తం 10 మ్యాచ్‌లు ఆడగా, ఇందులో అత్యధిక మ్యాచ్‌లలో భారత్ గెలిచింది. ముఖ్యంగా భారత్‌కు అచ్చొచ్చిన స్టేడియంగా పేరుంది. ఈ స్టేడియంలో అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ఆటగాడిగా రాహుల్ ద్రావిడ్ (735)కు గుర్తింపుపొందాడు.

వన్డేల్లో సచిన్ టెండూల్కర్ (281), టెస్టుల్లో వ్యక్తిగత అత్యధిక పరుగుల రికార్డు గౌతం గంభీర్ (179) మీద ఉంది. వన్డేల్లో యూనస్ ఖాన్ (117) పేరిట నమోదైవుంది. టెస్టుల్లో అనిల్ కుంబ్లే 36 వికెట్లు తీయగా, ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా డియాన్ నాష్‌ ఉండగా, వన్డేల్లో బెస్ట్ బౌలింగ్ గణాంకాలను మఖయా ఎన్తి (5/21) నమోదు చేసుకున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

డూమ్స్‌డే చేప సముద్రం నుంచి బైటకొస్తే భూకంపాలొస్తాయట: వణుకుతున్న స్పెయిన్

భార్యశీలాన్ని శంకించాడు ఓ భర్త.. ఇద్దరు పిల్లల్ని హత్య చేశాడు.. భార్య బతికిపోయింది..

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ప్రమాణం.. హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ (video)

సౌరశక్తి, బ్యాటరీ, పెట్రోల్‌తో నడిచే త్రీ-ఇన్-వన్ సైకిల్‌- గగన్ చంద్ర ఎవరు?

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు పొట్ట పెరిగిపోయిందే.. ట్రోల్స్ మొదలు.. ఆందోళనలో పీకే ఫ్యాన్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్యాణ్‌రామ్‌ మెరుపు చిత్రం పాటలో పాల్గొన్న విజయశాంతి - తాజా అప్ డేట్

హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా కవర్ పేజీలో అల్లు అర్జున్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

Show comments