Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాన్పూర్ వన్డే: భారత్ విజయలక్ష్యం 241

Webdunia
హీరోహోండా సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌లో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లాండ్‌ జట్టు భారత ముంగిట 241 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లకు భారత స్పిన్నర్లు అడ్డుకట్ట వేశారు. దీంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లలో ఏ ఒక్కరూ భారీ స్కోరు చేయలేక పోయారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన బొపరా(60) ఒక్కరే అర్థశతకాన్ని పూర్తి చేయడం గమనార్హం.

మరో ఓపెనర్ బెల్ (46) ఒ.ఎ.షా (40), పీటర్సన్ (13), కాలింగ్‌వుడ్ (1), పటేల్ (26), ఫ్లింటాఫ్ (26)లు భారత స్లో బౌలర్ల మాయాజాలంలో పడి వికెట్లను సమర్పించుకున్నారు. దీంతో ఇంగ్లాండ్ నిర్ణీత 48.4 ఓవర్లలో అన్ని వికెట్లను కోల్పోయి 240 పరుగులు మాత్రమే చేసింది. పరుగుల వరద పారే కాన్పూర్ పిచ్‌పై ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్స్ ఎవరూ కూడా పెద్దగా రాణించలేక పోయారు.

కాగా, భారత బౌలర్లలో స్పిన్ మాంత్రికుడు హర్భజన్ సింగ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. మునాఫ్ పటేల్ రెండు, ఇషాంత్ శర్మ రెండు వికెట్లు సాధించారు. యూసఫ్ పఠాన్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్‌లు ఒక్కో వికెట్‌ చొప్పున తీశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రధాన మంత్రి, అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారు? హస్తినను హస్తం?

Tenecteplase injection Free: పేదలకు భరోసా.. గుండెపోటు ఇంజెక్షన్ ఫ్రీ

3000 Votes: అరవింద్ కేజ్రీవాల్‌ను వెనక్కి నెట్టిన పర్వేష్.. రికార్డ్ బ్రేక్.. సీఎం పదవి ఆయనకేనా?

వాట్సాప్‌లోనే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇక హాల్ టిక్కెట్లు.. డౌన్‌లోడ్ ఈజీ

అబ్బా... మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోయిన వైఎస్ జగన్.. ఆందోళనలో వైసీపీ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

ఈ పనికిమాలిన వార్త ఎందుకురా?: అనుష్క శెట్టి పెళ్లివార్తపై ఓ నెటిజన్

Pawan Kalyan Johnny: పవన్ కల్యాణ్ సినిమా టైటిల్‌ను ఎంచుకున్న శర్వానంద్.. అదేంటో తెలుసా?

ప్రభాస్ కైండ్ పర్శన్, మన్మధుడు రీ రిలీజ్ రెస్పాన్స్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది :హీరోయిన్ అన్షు

Show comments