Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓపెనర్ల విజృంభణః పటిష్ట స్థితిలో భారత్

Webdunia
ఆదివారం, 19 అక్టోబరు 2008 (17:17 IST)
తొలి ఇన్నిగ్స్‌లో భారీ ఆధిక్యత సాధించి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఓపెనర్ల ద్వయం దూకుడుగా ఆడటంతో వికెట్ నష్టపోకుండా 23 ఓవర్లలో సరిగ్గా 100 పరుగులు చేసింది. ప్రత్యర్థి ముందు మంచి స్కోరు విధించే ఉద్దేశ్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఓపెనర్ల జంట వన్డే ఆటతీరుతో ఆసీస్ బౌలర్లను ఆడుకుంది. ఓపెనర్ల దూకుడుతో భారత్ మొత్తంమీద ఆసీస్‌పై 301 పరుగుల ఆధిక్యత సాధించి పటిష్టంగా నిలిచింది.

మూడో రోజు ఆట ముగిసేసరికి సెహ్వాగ్ 53, గంభీర్ 46 పరుగులతో క్రీజులో నిలిచారు. కాగా, నాలుగో రోజు త్వరత్వరగా పరుగులు సాధించి డ్రా చేస్తే ఆసీస్‌ను ఒత్తిడిలో పెట్టవచ్చని భారత్ ప్రత్యర్థికి ఫాలో ఆన్ కూడా ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్‌ను తానే ప్రారంభించింది. ధోనీ మరోసారి ప్రపంచ నంబర్ వన్ టీమ్‌కు సవాలు విసురుతూ బ్యాంటింగ్ ఎంచుకోవండం సరైందేనని భారత్ ఓపెనర్లు తమ ఆట తీరుతో నిరూపించారు.

అంతకు ముందు రెండో టెస్టు తొలి ఇన్నింగ్‌లో 268 పరుగులకే కుప్పగూలిన ఆసీస్‌ ఫాలో ఆన్‌లో పడినప్పటికీ భారత్ రెండో ఇన్నింగ్స్‌లో తానే బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. మూడో రోజు ఆటలో టీ విరామానంతరం 268 పరుగులకు ఆసీస్ జట్టు ఆలౌట్ కావడంతో ఫాలోఆన్ తప్పలేదు కాని భారత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఎంచుకుంది.

వాట్సన్ 78, బ్రెట్‌లీ 35 పరుగులతో చివర్లో ఆదుకున్నప్పటికీ చివరి వికెట్లు టపటపా రాలిపోవడంతో ఆసీస్ జట్టు మూడేళ్ల తర్వాత ఫాలోఆన్ చవిచూసింది. అయితే ఇప్పటికే 200 పరుగుల వరకు ఆధిక్యతలో ఉన్న భారత్ ముందస్తు వ్యూహంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఎంచుకోవడంతో ఆసీస్ తాత్కాలికంగా ఊపిరి పీల్చుకుంది.

ఆసీస్ జట్టులో కాటిచ్ 33, హస్సీ 54, క్లార్క్ 23, వాట్సన్ 78, బ్రెట్‌లీ 35 పరుగులు చేయగా 17 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. కాగా బారత్ జట్టులో అమిత్ మిశ్రా 71 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా ఇషాంత్ 2, భజ్జీ 2, జహీర్ ఖాన్ 1 వికెట్లు పడగొట్టారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీ యూనివర్సిటీ మెస్‌.. భోజనంలో జెర్రీ కనిపించింది.. విద్యార్థులు షాక్

చిరుధాన్యాల పునరుద్ధరణ, పత్తి పునరుద్ధరణ: ఢిల్లీ కళా ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాల నుండి సస్టైనబిలిటీ ఛాంపియన్లు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియకు బ్రేక్.. ఎందుకంటే?

Delhi Elections: పన్ను మినహాయింపే కలిసొచ్చిందా..? బీజేపీపై విజయంపై పవన్ ప్రశంసలు

కిరణ్ రాయల్ చేసిన మోసంతో చనిపోతున్నా: సెల్ఫీ వీడియోలో మహిళ సంచలన ఆరోపణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

Show comments