Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-3 టైటిల్ సచిన్ టెండూల్కర్ సేనకేనా...!?

Webdunia
FILE
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 20 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తూ.. అరుదైన ప్రపంచ రికార్డులతో యువక్రికెటర్లకు మార్గదర్శకంగా నిలిచిన టీం ఇండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారుండరు. అంతర్జాతీయ క్రికెట్‌లో సూపర్ స్టార్‌గా కొనసాగుతున్న లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ గ్వాలియర్ గడ్డపై చేసిన ప్రపంచ రికార్డుకు తిరుగేలేదు.

దక్షిణాఫ్రికాతో గ్వాలియర్ గడ్డపై జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ సాధించి అరుదైన ప్రపంచ రికార్డును సృష్టించిన క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్, తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఓ మెరుపు మెరుస్తున్నాడు. తన నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌ను తాను ముందుడి నడిపిస్తున్నాడు.

వ్యక్తిగతంగానూ తనను తాను మెరుగు పరుచుకుంటూ.. జట్టును కూడా సమర్థవంతంగా నడిపించే సత్తా తనలో ఉందని సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ మూడో సీజన్‌లో నిరూపించుకున్నాడు. ఇప్పటివరకు జరిగిన ఏడు ఐపీఎల్ మ్యాచ్‌ల్లో, ఆరింటిలో గెలుపును నమోదు చేసుకున్న ముంబై ఇండియన్స్, ఐపీఎల్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ మూడో అంచెల పోటీల్లో కేవలం ఒక్క ఓటమిని మాత్రమే చవిచూసిన సచిన్ సేన, 12 పాయింట్లతో అజేయంగా ముందుకు సాగుతోంది. ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లోనే గాకుండా, పరిమిత ఓవర్లలోనూ తాను దిట్టేనని నిరూపిస్తూ.. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెట్ వీరుడిగా టెండూల్కర్ (314) నిలిచాడు.

ఐపీఎల్-3 టాపర్‌గా కొనసాగేందుకు.. మాస్టర్ బ్లాస్టర్ అద్భుతమైన బ్యాటింగ్‌ కారణమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. బౌలర్లను హడలెత్తింపజేస్తూ... బంతికి తగ్గట్టు బ్యాట్‌ను కదిలిస్తూ.. గ్రౌండ్ షాట్లతో బౌండరీలను సాధించే సచిన్ టెండూల్కర్‌ తప్పకుండా, తన జట్టుకు టైటిల్‌ను సంపాదించిపెడుతాడని క్రీడా విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.

బ్యాట్ స్పీడ్.. అద్భుతమైన టైమింగ్‌‌తో తాను వ్యక్తిగతంగా తన స్కోరును మెరుగుపరుచుకుంటూ.. జట్టు ఆటగాళ్లకు అండగా నిలుస్తున్న సచిన్ టెండూల్కర్ ఈసారి ఐపీఎల్ టైటిల్‌ను నెగ్గే దిశగా జట్టును నడిపిస్తున్నాడు. మరి ఒక్కే ఒక విజయం తేడాతో రెండో స్థానంలో ఉన్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో పాటు మిగిలిన జట్లతో జరిగే హోరాహోరీ పోరులో సచిన్ సేన రాణించి, ఈసారి టైటిల్‌ను కైవసం చేసుకుంటుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే..!
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. జలవివాదంపై చర్చ.. ఎప్పుడో తెలుసా?

భార్యతో మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకున్న జవాను...

Tenth class girl: పదో తరగతి అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఏంటంటే?

కాబోయే భర్తను హత్య చేసిన మహిళ.. అరెస్టును నిలిపివేసిన సుప్రీంకోర్టు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

ఆంధ్ర కింగ్ తాలూకా లో సినిమా అభిమానిగా రామ్ పోతినేని

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Show comments