Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసీస్‌పై భారత్‌కు అతి పెద్ద విజయం

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2008 (03:37 IST)
మొహాలీ టెస్టులో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాపై అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. చివరి రోజు ఆటలో ఇంకా రెండు సెషన్‌ల ఆట మిగిలి ఉండగానే 320 పరుగుల భారీ స్కోరుతో ఆస్ట్రేలియాను మట్టిగరిపించిన భారత్ 4 సీరీస్‌ల మ్యాచ్‌లో 1-0 ఆధిక్యతతో ముందు నిలిచింది.

జహీర్ వరుసగా మూడు వికెట్లు పడగొట్టడంతో భారత్ చివరి రోజు 18.4 ఓవర్లలో కేవలం ఒకటన్నర గంటలోపే ఆస్ట్రేలియాపై లాంఛనప్రాయంగా విజయం సాధించింది చరిత్ర సృష్టించింది. ఘోరమైన విషయం ఏమిటంటే మొహాలీలో ఆసీస్ అన్నిరంగాల్లోనూ పేలవమైన ఆటతీరును ప్రదర్శించి భారత్ చేతిలో భంగపాటుకు గురైంది.

ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సాధ్యం కానివిధంగా 516 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ టాప్ ఆర్డర్ కుప్పకూలిపోవడంతో ఘోరంగా చేతులెత్తేసింది. ఫ్రంట్ లైన్ ఆటగాళ్లు వరుస కట్టిన క్రమంలో ఆసీస్ లోయర్ మిడిలార్డర్ ఆటగాళ్లు చేసేదేమీ లేక విజయాన్ని అలవోకగా భారత్‌కు అప్పగించారు.

ఆసీస్ 195 పరుగులకే చాప చుట్టేయడానికి జహీర్ ఖాన్ విజృంభణ ప్రధాన కారణం. కెరీర్‌లోనే శిఖరాయమాన ఆటతీరు ప్రదర్శించిన జహీర్ ప్రారంభంలోనే ఆసీస్‌ను కోలుకోని దెబ్బతీశాడు. ఫలితం.. ఆసీస్‌పై భారత్‌కు అతిపెద్ద విజయం.

గతంలో 1977లో మెల్‌బోర్న్‌లో ఆసీస్‌పై భారత్ 222 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించిన రికార్డును మొహాలీ తిరగరాసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీ యూనివర్సిటీ మెస్‌.. భోజనంలో జెర్రీ కనిపించింది.. విద్యార్థులు షాక్

చిరుధాన్యాల పునరుద్ధరణ, పత్తి పునరుద్ధరణ: ఢిల్లీ కళా ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాల నుండి సస్టైనబిలిటీ ఛాంపియన్లు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియకు బ్రేక్.. ఎందుకంటే?

Delhi Elections: పన్ను మినహాయింపే కలిసొచ్చిందా..? బీజేపీపై విజయంపై పవన్ ప్రశంసలు

కిరణ్ రాయల్ చేసిన మోసంతో చనిపోతున్నా: సెల్ఫీ వీడియోలో మహిళ సంచలన ఆరోపణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

Show comments