Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనూహ్యమలుపులకు పెట్టింది పేరుగా ఇంగ్లండ్ జట్టు!

Webdunia
FILE
భారత ఉపఖండంలో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ - 2011 మెగా ఈవెంట్‌లో ఇంగ్లండ్ జట్టు పరిస్థితి ఏమాత్రం అంతుచిక్కడం లేదు. సులభంగా గెలుస్తుందని భావించిన మ్యాచ్‌లలో పరాజయం పాలవుతూ.. ఖచ్చితంగా ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లలో విజయ కేతనం ఎగుర వేస్తోంది. ఇలా.. అనూహ్యమలుపుల మధ్య ఆ జట్టు రాణిస్తున్న ఆటతీరును చూస్తుంటే ఇంగ్లండ్ అభిమానులకే కాకుండా సగటు క్రికెట్ అభిమానులకు సైతం బుర్ర వేడెక్కి పోతోంది.

క్రికెట్ క్రీడకు పుట్టినిల్లుగా పేరొందిన ఇంగ్లండ్ ప్రపంచ కప్‌కు అనేక మార్లు ఆతిథ్యం ఇచ్చింది. సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లలో తమ సత్తా చాటలేక చతికిల పడింది. అలాగే, విదేశీ గడ్డలపై జరిగే మ్యాచ్‌లలోనూ ఇదే పరిస్థితి పునరావృత్తం చేస్తోంది. ఆ జట్టు ఆటగాళ్ళలో నిలకడ లేమి కారణంగా ఈ పరిస్థితి ఉత్పన్నమవుతోందన్నది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.

ఇందుకు తాజా ప్రపంచ కప్‌లో అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. గత నెల 27వ తేదీన భారత్‌తో బెంగుళూరులో జరిగిన మ్యాచ్‌లో విజయం వైపు దూసుకెళ్తున్న సమయంలో అనూహ్యంగా మ్యాచ్‌ 'టై' చేసుకుంది. దీంతో రెండు పాయింట్లకు బదులు ఒక పాయింట్‌తో సరిపుచ్చుకుంది.

ఇకపోతే ఈనెల ఆరో తేదీన క్రికెట్ పసికూన ఐర్లాండ్ జట్టు ముంగిట 324 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లోనూ ఇంగ్లీష్ ఆటగాళ్లు అనుహ్య ఓటమిని చవిచూశారు. దీంతో క్రికెట్ పసికూన భారీ లక్ష్య ఛేదన రికార్డును ఇంగ్లండ్‌పై నమోదు చేసుకున్నారు.

కాగా.. ఆదివారం చెన్నయ్ చిదంబరం స్టేడియంలో సపారీల (దక్షిణాఫ్రికా)లతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి ఖాయమని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. అయితే, బ్రాడ్ పుణ్యమాని అనూహ్యంగా విజయకేతనం ఎగురవేసింది. ఇలా.. అనూహ్య విజయాలతో ఇంగ్లండ్ జట్టు క్రికెట్ పండితులను సైతం ఆశ్చర్యచకితులను చేస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharashtra: ఫోన్ చూసుకుంటూ వచ్చిన తండ్రి.. నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన తండ్రి.. ఎక్కడ? (video)

195 ఎర్రచందనం దుంగల స్వాధీనం.. పోలీసులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

తిరుమల నందకం అతిథి గృహంలో దంపతుల ఆత్మహత్య.. చీరతో ఉరేసుకుని?

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య... కారణాలేంటో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

Show comments