Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసీస్ వికెట్ కీపర్ గిల్‌క్రిస్ట్ ప్రొఫైల్

Webdunia
ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించే క్రీడాకారుడు ఆడమ్ గిల్‌క్రిస్ట్. అటు కీపింగ్, ఇటు బ్యాటింగ్‌లో రాణిస్తూ.. జట్టుకు కొండంత అండగా నిలుస్తున్నాడు. ముఖ్యంగా.. వన్డే మ్యాచ్‌లలో ఓపెనర్‌గా బరిలోకి దిగే గిల్లీ బౌలర్లపై విచక్షణారహితంగా విరుచుకపడి జట్టుకు భారీ ఓపెనింగ్ ఇస్తున్నాడు. అంతేకాకుండా కీపర్‌గా అత్యధిక క్యాచ్‌లు పట్టి ప్రపంచ రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఇలా అద్భుతంగా రాణిస్తున్న గిల్లీ ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. ఈ నేపథ్యంలో గిల్లీ ప్రొఫైల్ పరిశీలిస్తే...

పూర్తి పేరు.. ఆడమ్ క్రెగ్ గిల్‌క్రిస్ట్
పుట్టిన తేది.. 1971, నవంబరు 14, న్యూ సౌత్ వేల్స్.
ప్రస్తుత వయస్సు.. 36 సంవత్సరాలు.
ఆడేజట్లు.. ఆస్ట్రేలియా, ఐసిసి ప్రపంచ xi, న్యూ సౌత్ వేల్స్, వెస్టర్న్ ఆస్ట్రేలియా.
నిక్‌నేమ్.. గిల్లీ, చర్చీ.

జట్టులో స్థానం.. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్
బ్యాటింగ్ స్టైల్.. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటింగ్ స్టైల్
బౌలింగ్ స్టైల్.. రైట్ ఆర్మ ఆఫ్ బ్రేక్.
ఫీల్డింగ్ పొజిషన్.. వికెట్ కీపర్
ఎత్తు.. 1.86 మీటర్లు

వన్డే క్రికెట్ ప్రవేశం.. 1996, అక్టోబరు 25వ తేదీ దక్షిణాఫ్రికాపై.
టెస్టుల అరంగేట్రం... 1999 నవంబరు పాకిస్తాన్‌పై.
వన్డే కెరీర్: ఆడిన మ్యాచ్‌లు... 282, పరుగులు.. 9505, సెంచరీలు.. 16, అర్థసెంచరీలు 54. అత్యధిక స్కోరు 172.
టెస్టులు: 96, పరుగులు 5570, సెంచరీలు 17, అర్థ సెంచరీలు 26, అత్యధిక స్కోరు.. 204.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments