Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో విండీస్, పాకిస్థాన్‌లకు చోటు!

Webdunia
శనివారం, 28 జూన్ 2014 (12:34 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎగ్జిక్యూటివ్ కమిటీలో వెస్టిండీస్, పాకిస్థాన్ జట్లకు కూడా చోటు కల్పించారు. ఈ మేరకు మెల్ బోర్న్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో మొత్తం ఐదు సభ్య దేశాలుంటాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ శాశ్వత సభ్యదేశాలు కాగా, మరో రెండు దేశాలకు ఏడాది ప్రాతిపదికన అవకాశం కల్పిస్తారు. 
 
కాగా, ఈ కమిటీలో దక్షిణాఫ్రికాకు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే, అదే దేశానికి చెందిన డేవ్ రిచర్డ్సన్‌పై వాత్సల్యం ప్రదర్శించారు. సీఈవోగా ఆయన పదవీకాలాన్ని రెండేళ్ళు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఐసీసీ చీఫ్‌గా సస్పెండ్ అయిన ఎన్. శ్రీనివాసన్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఐసీసీ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ ఎంపికపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments