Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత జట్టు ఓటమికి మేమే కారణం: మహేంద్ర సింగ్ ధోనీ

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (12:29 IST)
ఇంగ్లండ్‌తో సౌతాంప్టన్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు చిత్తుగా ఓడిపోవడానికి ప్రధాన కారణం బ్యాట్స్‌మెన్లేనని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డారు. మూడో టెస్ట్ మ్యాచ్‌లో ధోనీ సేన ఇంగ్లండ్ చేతిలో 266 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. ఈ ఓటమిపై ధోనీ స్పందిస్తూ.. ఓటమికి బ్యాట్స్ మెన్ వైఫల్యమే కారణమని అన్నాడు. 
 
పేలవంగా అవుటయ్యారని విమర్శించాడు. జట్టులో ప్రతిభకు లోటులేదని, మానసిక దృక్పథంలోనే మార్పురావాలని ధోనీ అభిప్రాయపడ్డాడు. ఇక, గతకొంతకాలంగా నలుగుతున్న నలుగురు బౌలర్ల వ్యూహంపైనా ధోనీ తన అభిప్రాయం వెలిబుచ్చాడు. ఆ వ్యూహాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. 
 
ఈ మ్యాచ్‌లో నలుగురు బౌలర్లతో ఎందుకు బరిలో దిగారన్న ప్రశ్నకు బదులిస్తూ, తామెప్పుడూ ఐదో బౌలర్‌ను తీసుకోలేదని తెలిపాడు. పార్ట్ టైమర్లతోనే నెట్టుకువచ్చేవాళ్ళమని చెప్పాడు. ఇక, ఈ టెస్టులో అద్భుత విజయాన్ని దక్కించుకున్న ఇంగ్లండ్ జట్టు సారథి ఆలిస్టర్ కుక్ మాట్లాడుతూ, మూడో టెస్టులో అన్ని సెషన్లలోనూ ఆధిపత్యం చెలాయించామన్నాడు. సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చాడు.

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

సంసారం ఎలా సాగుతుందని అడిగేవారు.. పక్కన కూర్చోకపోతే..?

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

Show comments