Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్‌తో విరాట్ కోహ్లీ సీక్రెట్ డిన్నర్!!

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (10:50 IST)
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్‌తో భారత క్రికెట్ జట్టు ఉపసారథి విరాట్ కోహ్లీ సీక్రెట్‌గా డిన్నర్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లోని బ్రెజిలియన్ రెస్టారెంట్‌లో వీరిద్దరూ విందు ఆరగించినట్టు బీబీసీ రేడియో ఓ కథనం ప్రసారం చేసింది. 
 
సాంకేతిక నైపుణ్యంతో షాట్లు ఆడే కోహ్లీ ఇంగ్లండ్ పర్యటనలో ఘోరంగా విఫలమైన విషయం తెల్సిందే. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌లలో పూర్తిగా విఫలమయ్యాడు. కోహ్లీకి ఇదే తొలి ఇంగ్లండ్ పర్యటన దీంతో ఇక్కడి పిచ్‌లపై పెద్దగా అవగాహన లేదు. అయితే, మైఖేల్ వాన్‌కు ఇక్కడి పిచ్‌లు కొట్టిన పిండి. దీంతో ఇక్కడ రాణించడానికి కోహ్లీ విందు గాలమేసి ఉంటాడని మాజీలు చెబుతున్నారు. 
 
కాగా, డిన్నర్ వ్యవహారం రెండు శిబిరాల్లో ఆసక్తిని రేపింది. దీనిపై వాన్, కోహ్లీ స్పందించకపోవడంతో ఊహాజనిత కథనాలు పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్నాయి. విందు తర్వాత ఇంగ్లీష్ స్వింగ్ పిచ్‌లపై బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటే వారి మధ్య కోహ్లీ బ్యాటింగ్‌పై చర్చ జరిగినట్టు, లేకుంటే ఇంకేమైనా చర్చలు జరిగినట్టు భావించడమే! 

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

కరెంట్ షాక్ తగిలి పడిపోయిన బాలుడు, బ్రతికించిన వైద్యురాలు - video

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

Show comments