Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ్యూస్ కొత్త హెల్మెట్ ధరించివుంటే ప్రాణాపాయం తప్పేది : హెల్మెట్ తయారీ కంపెనీ!

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (17:48 IST)
ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ తాము తయారుచేసిన కొత్త హెల్మెట్ ధరించివుండివుంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని హెల్మెట్ తయారీకంపెనీ మాసురి వెల్లడించింది. బౌన్సర్ తలకు తగలడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఫిలిప్ హ్యూస్ చావుబతుకుల మధ్య పోరాడుతుండడం క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెల్సిందే. 
 
అయితే, హెల్మెట్ ధరించినా అతడికి గాయం కావడంపై ఇప్పుడు బ్యాట్స్‌మెన్ భద్రతపై చర్చ జరుగుతోంది. దీనిపై, ప్రఖ్యాత క్రికెట్ హెల్మెట్ తయారీదారు 'మాసురి' స్పందించింది. హ్యూస్ వాడింది పాత మోడల్ హెల్మెట్ అని తెలిపింది. తమ కొత్త మోడల్ హెల్మెట్‌ను ధరించి ఉంటే హ్యూస్ గాయపడేవాడు కాదని అభిప్రాయపడింది. 
 
అభివృద్ధి పరిచిన కొత్త మోడల్ హెల్మెట్ బ్యాట్స్‌మెన్‌కు మెరుగైన రక్షణ కల్పిస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంది. బ్రిటన్‌కు చెందిన 'మాసురి' క్రికెట్ రక్షణ ఉపకరణాల తయారీలో ప్రసిద్ధిగాంచింది. హ్యూస్‌కు తల వెనుక మెడ భాగంలో బలంగా దెబ్బ తగిలిందని, ఆ భాగాన్ని హెల్మెట్లు పూర్తిగా కవర్ చేయలేకపోతున్నాయని 'మాసురి' పేర్కొంది. హ్యూస్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపింది. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments