Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్ హ్యూస్ ధరించిన పాత హెల్మెట్ అందుకే ఈ దుస్థితి!: మాసురి

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (14:44 IST)
ఆసీస్ ఓపెనర్ ఫిలిప్ హ్యూస్ న్యూ సౌత్ వేల్స్ బౌలర్ వేసిన బంతికి తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు. ఫిలిప్ హ్యూస్ పరిస్ధితి విషమంగానే ఉంది. చికిత్స కోసం అతడిని కృత్రమ కోమాలోకి తీసుకెళ్లిన విషమం తెలిసిందే.
 
ఇక.. ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ ఫిలిప్ హ్యూస్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన యావత్తు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బౌన్సర్ తలకు తగలడంతో తీవ్రంగా గాయపడిన హ్యూస్.. కోమాలోకి వెళ్లిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
అయితే హ్యూస్ హెల్మెట్ ధరించినా అతడికి గాయం కావడంపై ఇప్పుడు బ్యాట్స్ మెన్ భద్రతపై చర్చ జరుగుతోంది. దీనిపై, ప్రఖ్యాత క్రికెట్ హెల్మెట్ తయారీదారు 'మాసురి' స్పందించింది. హ్యూస్ వాడింది పాత మోడల్ హెల్మెట్ అని తెలిపింది. 
 
తమ కొత్త మోడల్ హెల్మెట్‌ను ధరించి ఉంటే హ్యూస్ గాయపడేవాడు కాదని అభిప్రాయపడింది. అభివృద్ధి పరిచిన కొత్త మోడల్ హెల్మెట్ బ్యాట్స్ మెన్‌కు మెరుగైన రక్షణ కల్పిస్తుందని 'మాసురి' వర్గాలు వివరించాయి. 
 
బ్రిటన్‌కు చెందిన 'మాసురి' క్రికెట్ రక్షణ ఉపకరణాల తయారీలో ప్రసిద్ధిగాంచింది. హ్యూస్‌కు తల వెనుక మెడ భాగంలో బలంగా దెబ్బ తగిలిందని, ఆ భాగాన్ని హెల్మెట్లు పూర్తిగా కవర్ చేయలేకపోతున్నాయని 'మాసురి' పేర్కొంది. హ్యూస్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపింది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments