Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఫిల్ హ్యూజెస్ పరిస్థితి విషమం!

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (13:05 IST)
ఆసీస్ యువ బ్యాట్స్‌మెన్ ఫిల్ హ్యూజెస్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు నిర్ధారించారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో న్యూ సౌత్ వేల్స్ - సౌత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ సందర్భంగా ఫిల్ తీవ్రంగా గాయపడ్డాడు. 
 
ఇండియాతో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో గాయపడ్డ మైఖేల్ క్లార్క్ స్థానంలో ఫిల్‌కు పిలుపు వస్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంచి ఫామ్‌లో ఉన్న ఫిల్ హ్యూజెస్ షెఫీల్డ్ మ్యాచ్‌లో కూడా 63 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు
 
ఈ నేపథ్యంలో షాన్ అబాట్ విసిరిన బౌన్సర్‌ను తప్పుగా అంచనా వేసిన ఫిల్... హుక్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ సందర్భంగా అతని తల పక్క భాగాన్ని బంతి బలంగా తాకింది. దీంతో పిచ్ మీద ఫిల్ హ్యూజెస్ కుప్పకూలిపోయాడు. వెంటనే ఫిల్‌ను మూడు అంబులెన్సులు, ఒక హెలికాప్టర్ సహాయంతో ఆసుపత్రికి తరలించారు. 
 
ఫిల్‌ను పరీక్షించిన వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఫిల్‌కు అత్యవసర చికిత్స కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments