Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేంద్ర సింగ్‌ ధోనీకి ఊరట: కెప్టెన్‌గా తప్పించేది లేదు!

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (11:20 IST)
ఇంగ్లండ్ చేతిలో టెస్టు సిరీస్ పరాభవం నేపథ్యంలో విమర్శల జడివానలో తడిసి ముద్దవుతున్న టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఊరట లభించింది. కెప్టెన్‌గా ధోనీని తప్పించేది లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) స్పష్టం చేసింది. 
 
బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ, ధోనీపై వేటు వేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. గెలుస్తారనుకున్న సిరీస్‌ను పేలవరీతిలో కోల్పోవడం పట్ల మాజీ క్రికెటర్లు ధోనీ నాయకత్వ సామర్థ్యాన్ని తూర్పారబట్టారు. 
 
టెస్టు సారథ్య బాధ్యతల నుంచి ధోనీని తప్పించాలని వారు సూచించారు. కానీ, బీసీసీఐ మాత్రం ఈ జార్ఖండ్ డైనమైట్‌పై నమ్మకముంచింది. వన్డే వరల్డ్ కప్‌కు మరో ఆరు నెలలు మాత్రమే ఉండడంతో కెప్టెన్ మార్పు జట్టుపై ప్రభావం చూపుతుందని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి.

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

Show comments