Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌తో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడనున్న మహేళ జయవర్ధనే!

Webdunia
మంగళవారం, 12 ఆగస్టు 2014 (16:13 IST)
శ్రీలంక క్రికెట్ మూలస్తంభాల్లో ఒకడిగా పేరుగాంచిన మహేళ జయవర్ధనే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. గురువారం నుంచి పాకిస్థాన్‌తో ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్ చివరి మ్యాచ్ కానుంది. 
 
ఇటీవలే టి20 వరల్డ్ టైటిల్ గెలిచిన అనంతరం మినీ ఫార్మాట్ కు వీడ్కోలు చెప్పిన ఈ మాజీ కెప్టెన్, తాజాగా టెస్టు బరి నుంచి తప్పుకోనుండడంతో లంక క్రికెట్ ఫ్యాన్స్ విచారంలో మునిగిపోయారు. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిస్థాయిలో తప్పుకునే అవకాశాలున్నాయి. 
 
కాగా, ప్రపంచ క్రికెట్లో వన్డేలు, టెస్టుల్లో 11 వేలకు పైగా పరుగులు సాధించిన ఐదుగురు క్రికెటర్లలో మహేల ఒకడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, జాక్వెస్ కలిస్, కుమార సంగక్కర ఉన్నారు. ఇప్పటివరకు 148 టెస్టులాడిన మహేల 50.02 సగటుతో 11,756 పరుగులు చేశాడు. వాటిలో 34 సెంచరీలు, 49 అర్థసెంచరీలు ఉన్నాయి.

లోక్‌సభ ఎన్నికలు.. చివరి దశ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు

జూన్ 4న కౌంటింగ్-గేమ్ ఛేంజర్‌గా మారనున్న పోస్టల్ బ్యాలెట్లు..

ఆ బాలిక ఆత్మవిశ్వాసంతో అద్భుత విన్యాసాలు - video

16 ఏళ్ల బాలిక-14 ఏళ్ల బాలుడు... చున్నీతో చేతులు కట్టేసుకుని సముద్రంలో దూకేశారు..?

బీజేపీ నేత ఆరతి కృష్ణ యాదవ్ ఏకైక కుమారుడు ఆస్ట్రేలియాలో మృతి

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

Show comments