Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్ హ్యూస్ మృతి: గతంలో మన క్రికెటర్ కూడా.. బంతి తగిలి..?

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (14:18 IST)
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి యావత్తు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. "క్రికెట్ డేంజరస్ గేమ్" అని విండీస్ బ్యాటింగ్ కింగ్ బ్రయాన్ లారా చెప్పినట్లు ఫిలిప్ హ్యూస్ లాగానే గతంలో మన క్రికెటర్ కూడా బంతి తగిలి ప్రాణాలు కోల్పోయాడు.
 
బ్యాట్స్‌మన్ రిస్క్ అధికమని, ఎంత సేఫ్టీ ఉపకరణాలు ధరించినా ఒక్కోసారి ముప్పు తప్పట్లేదు. ఇలాంటి ఘటనలు క్రికెట్ డైరీలో ఉన్నాయి. అలాంటి ఘటనల వివరాల్లోకెళితే... గతంలో భారత్‌కు చెందిన రమణ్ లాంబా కూడా బంతి తగిలి మరణించాడు. 
 
1998లో బంగ్లాదేశ్‌లో క్లబ్ క్రికెట్ ఆడుతూ లాంబా ఓ మ్యాచ్‌లో షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్‌కు నిలుచున్నాడు. బ్యాటింగ్ చేస్తున్న మెహ్రాబ్ హుస్సేన్ బలంగా షాట్ కొట్టాడు. బంతి లాంబాకు గట్టిగా తగిలింది. దీంతో, కుప్పకూలిపోయాడు. అనంతరం ఆసుపత్రికి తరలించగా, కోమాలోకెళ్లాడు. మూడురోజులు పాటు మృత్యువుతో పోరాడిన లాంబా చివరికి కన్నుమూశాడు. 
 
క్రికెట్లో ఇలాంటి విషాద ఘటనలు కొన్ని చోటుచేసుకున్నాయి. 1959లో అబ్దుల్ అజీజ్ అనే పాకిస్థానీ దేశవాళీ క్రికెటర్ 19 ఏళ్ల ప్రాయంలోనే ప్రాణాలు విడిచాడు. 
 
1960లో భారత వికెట్ కీపింగ్ బ్యాట్స్ మన్ నారీమన్ కాంట్రాక్టర్‌కు విండీస్ బౌలర్ చార్లీ గ్రిఫిత్ వేసిన బౌన్సర్ తగిలింది. దీంతో, నారీమన్ ఆరు రోజులు కోమాలో ఉన్నాడు. ప్రాణాలు నిలిచినా, అతని కెరీర్‌కు అదే చివరి మ్యాచ్ అయింది. 1975లో కివీస్ ఆటగాడు ఈవెన్ చాట్ ఫీల్డ్‌కు నాలుక తెగింది. ఇంగ్లండ్ పేసర్ లీవర్ వేసిన బంతిని ఆడబోయి గాయపడ్డాడు.

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

Show comments