Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెటర్ల ఫుడ్ మెనూ నుంచి పశు - పంది మాంసం తొలగింపు!

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (14:05 IST)
త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లను భారత క్రికెటర్లకు అందించే ఆహార జాబితా నుంచి బీఫ్ (పశుమాంసం), పోర్క్ (పందిమాంసం)ను తొలగించారు. అయితే, చికెన్‌ను మాత్రం యధావిధిగా కొనసాగిస్తున్నారు. పైగా.. తమ వెంట ఓ చెఫ్‌ను కూడా ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకెళ్తున్నారు. 
 
నిజానికి భారత క్రికెటర్లు మంచి భోజన ప్రియులన్న విషయం తెల్సిందే. ఇటీవల హైదరాబాద్‌లో సహచర క్రికెటర్ ఇంట్లో తయారు చేసిన హైదరాబాద్ డమ్ బిర్యానీని తాము నివశిస్తున్న హాటల్‌కు అనుమతించలేదన్న కోపంతో ఏకంగా హోటల్‌నే ఖాళీ చేసి మరో హటోల్‌కు వెళ్లిన విషయం తెల్సిందే. ఈ అంశం దేశ మీడియా కథనాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. 
 
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆసీస్ పర్యటన సందర్భంగా భారత క్రికెటర్లకు కష్టం వచ్చింది. మధ్యాహ్న భోజనంలో బటర్ చికెన్, రైస్‌‌తోనే సరిపెట్టుకోవాలట. దీనికి కారణం లేకపోలేదు. ఫిట్నెస్ దెబ్బతింటుందన్న భయంతో ఫుడ్ మెనూ నుంచి అనేక ఐటమ్స్‌లలో కోత పెట్టారు. 
 
ముఖ్యంగా స్పైసీ ఫుడ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పైగా తమ వెంట ఓ చెఫ్‌ను కూడా తీసుకెళ్తున్నారు. అలాగే, క్రికెట్ ఆస్ట్రేలియాకు మెనూలో ఉండాల్సిన వంటకాల వివరాలను పంపించారు. అందులో ఎర్రని పెద్ద అక్షరాలో 'నో స్పైసీ ఫుడ్' అని స్పష్టంగా కనిపించేలా రాశారు. 
 
ప్రస్తుత జట్టులో అత్యధికులు వెజిటేరియన్లు కావడంతో వారికి ప్రత్యేక ఆహారం అందించనున్నారు. ఇక, బీఫ్ (పశుమాంసం), పోర్క్ (పందిమాంసం)కు నో చెప్పేశారు. బ్రేక్ ఫాస్ట్‌లో గ్రిల్డ్ మష్రూమ్స్, బేక్డ్ బీన్స్, యోగర్ట్, తాజా ఫలాలు తీసుకుంటారు. లంచ్ విషయానికొస్తే బటర్ చికెన్, స్టీమ్డ్ రైస్, చేపలు, డ్రై వెజిటబుల్ కర్రీ మెనూలో చేర్చారు. 

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

Show comments