Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిఫ్ హ్యూస్: పాత హెల్మెట్ ధరించడంతోనే చావుబతుకుల మధ్య..

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (16:36 IST)
ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఫిలిఫ్ హ్యూస్ సిడ్నీ స్టేడియంలో క్రికెట్ ఆడుతూ బంతి తలకు తగలడం వల్ల కోమాలోకి వెళ్ళిపోయారు. ఇందుకు పాత హెల్మెట్ వాడటమే కారణమని మసూరి తెలిపింది. 
 
ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ ఫిలిప్ హ్యూస్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన యావత్తు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బౌన్సర్ తలకు తగలడంతో తీవ్రంగా గాయపడిన హ్యూస్.. కోమాలోకి వెళ్లిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
అయితే హ్యూస్ హెల్మెట్ ధరించినా అతడికి గాయం కావడంపై ఇప్పుడు బ్యాట్స్ మెన్ భద్రతపై చర్చ జరుగుతోంది. దీనిపై, ప్రఖ్యాత క్రికెట్ హెల్మెట్ తయారీదారు 'మాసురి' స్పందించింది. హ్యూస్ వాడింది పాత మోడల్ హెల్మెట్ అని తెలిపింది. 
 
తమ కొత్త మోడల్ హెల్మెట్‌ను ధరించి ఉంటే హ్యూస్ గాయపడేవాడు కాదని అభిప్రాయపడింది. అభివృద్ధి పరిచిన కొత్త మోడల్ హెల్మెట్ బ్యాట్స్ మెన్‌కు మెరుగైన రక్షణ కల్పిస్తుందని 'మాసురి' వర్గాలు వివరించాయి. 
 
బ్రిటన్‌కు చెందిన 'మాసురి' క్రికెట్ రక్షణ ఉపకరణాల తయారీలో ప్రసిద్ధిగాంచింది. హ్యూస్‌కు తల వెనుక మెడ భాగంలో బలంగా దెబ్బ తగిలిందని, ఆ భాగాన్ని హెల్మెట్లు పూర్తిగా కవర్ చేయలేకపోతున్నాయని 'మాసురి' పేర్కొంది. హ్యూస్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపింది.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments