Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడిలైడ్ టెస్టు: రెచ్చిపోయిన బ్యాట్స్‌మెన్.. ఆసీస్ స్కోర్ 517/7

Webdunia
బుధవారం, 10 డిశెంబరు 2014 (17:25 IST)
అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ రెచ్చిపోయారు. ఒకరిని చూసి మరొకరు సెంచరీలు బాదేశారు. భారత బౌలర్ల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని చెలరేగిపోయారు. వెలుతురు లేక ఆట నిలిచిపోవడంతో రెండోరోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 517 పరుగుల భారీ స్కోరు చేశారు. 
 
తొలిరోజు ఆటలో వార్నర్ 145 పరుగులతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించగా.. రెండో రోజు వర్షం అంతరాయం కలిగించినా ఏమాత్రం లెక్కచేయకుండా క్లార్క్, స్మిత్ భారీగా పరుగుల వర్షం కురిపించారు. క్లార్క్ 128 పరుగులు చేసి కేవీ శర్మ బౌలింగులో పుజారాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
 
స్మిత్ మాత్రం తన పరుగుల దాహం ఇంకా తీరలేదన్నట్లు 162 పరుగులు చేసి ఇంకా నాటౌట్గానే మిగిలాడు. మిగిలిన వాళ్లలో ఒక్క మార్ష్ మినహా ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. 
 
ఇకపోతే.. భారత బౌలర్లలో షమీ, వరుణ్ ఆరోన్, కేవీ శర్మ రెండేసి వికెట్లు పంచుకోగా లంబూ ఇషాంత్ శర్మకు మాత్రం ఒక్క వికెట్టే దక్కింది. రెండోరోజు వర్షం అడ్డం పడటంతో కేవలం 31 ఓవర్లు మాత్రమే బౌలింగ్ జరిగింది. ఆట ముగిసే సమయానికి స్మిత్ 162 పరుగులతోను, జాన్సన్ 0 పరుగులతోను క్రీజులో ఉన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments