Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిస్బేన్ టెస్టు: బౌలర్లదే హవా.. భారత్ 408 ఆలౌట్.. ఆస్ట్రేలియా 221

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (15:10 IST)
బ్రిస్బేన్‌లో టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో బౌలర్లు సత్తా చాటారు. రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా కూడా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. నాలుగు వికెట్లు కోల్పోయి 311 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో భారీ స్కోరు చేస్తుందనుకున్న టీమిండియా 408 పరుగులకే పరిమితమైంది. అయితే అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ 52 ఓవర్లు మాత్రమే ఆడి నాలుగు వికెట్లను చేజార్చుకుంది.
 
తొలి రోజు బ్యాట్స్‌మెన్‌ల హవా కొనసాగినా.. రెండో రోజు ఆటలో మాత్రం బౌలర్లు చెలరేగిపోయారు. ఈ రోజు ఆటలో మొత్తం మీద 10 వికెట్లు నేలరాలడం విశేషం. రెండో రోజు తన తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ స్వల్వ వ్యవధిలో కీలక వికెట్లను కోల్పోయింది.
 
ఆసీస్ ఆటగాళ్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్(29)పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో వెనుదిరగగా, అతని స్థానంలో క్రీజ్ లోకి వచ్చిన షేన్ వాట్సన్ (25) పరుగులు మాత్రమే పెవిలియన్ చేరాడు. తరువాత ఆసీస్‌ను రోజర్స్ (55), కెప్టెన్ స్టీవెన్ స్మిత్(65*) పరుగులతో ఆదుకున్నారు.
 
ప్రస్తుతం 221 పరుగులకు నాలుగు వికెట్ల కోల్పోయిన ఆసీస్.. టీమిండియా తొలి ఇన్నింగ్స్ కంటే 187 పరుగుల వెనకబడి ఉంది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్‌ మూడు వికెట్లు సొంతం చేసుకోగా, అశ్విన్ ఒక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments