Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీకి బీసీసీఐ షాక్: కోచ్ సంగతి మేం చూసుకుంటాం!

Webdunia
మంగళవారం, 26 ఆగస్టు 2014 (10:50 IST)
టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీకి బిసిసిఐ షాక్ ఇచ్చింది. హెడ్ కోచ్ డంకెన్ ఫ్లెచర్ విషయంలో ధోనీ చేసిన వ్యాఖ్యను బిసిసిఐ కొట్టిపారేసింది. అది ధోనీ వ్యక్తిగత అభిప్రాయమంటూ తీసిపారేసింది. 
 
ఈ స్థితిలో భారత క్రికెట్ క్రీడలో మరోసారి ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైనట్లు క్రీడా పండితులు భావిస్తున్నారు. ఫలితంగా ధోనీ, బీసీసీఐ అధికారుల మధ్య దూరం క్రమంగా పెరుగుతున్నట్టు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. 
 
ధోనీకి బిసిసిఐ చాలా కాలంగా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ వస్తోంది. విదేశాల్లో ఎన్ని పర్యాయాలు విఫలమైనా, ఎంత ఘోరంగా పరాజయాలను ఎదుర్కొన్నా ధోనీ కెప్టెన్సీకిగానీ, జట్టులో అతని స్థానానికిగానీ ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. 
 
సుప్రీం కోర్టు ఆదేశాలతో బిసిసిఐ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగిన ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్ శ్రీనివాసన్‌తో ధోనీకి సత్సంబంధాలున్నాయి. అయితే ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఓటమితో ధోనీతో సంబంధాలను బీసీసీఐ కట్ చేసుకోనుందని సమాచారం. 

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

Show comments