Webdunia - Bharat's app for daily news and videos

Install App

నష్టపరిహారం చెల్లిస్తారా.. కోర్టుకు వస్తారా : బీసీసీఐ అల్టిమేటం!

Webdunia
ఆదివారం, 25 జనవరి 2015 (12:50 IST)
వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గట్టి వార్నింగ్ ఇచ్చింది. నష్టపరిహారం రాబట్టుకునే విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడే ప్రశ్నేలేదని తేల్చి చెప్పింది. 
 
గత ఏడాది అక్టోబర్‌లో విండీస్‌ జట్టు భారత పర్యటన నుంచి అర్థాంతరంగా రద్దు చేసుకుని వెళ్ళడం వల్ల కలిగిన నష్టానికిగాను రూ.257.67 కోట్లు చెల్లించాలని బీసీసీఐ అల్టిమేటం జారీ చేసింది. నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ.. విండీస్‌ బోర్డు అధ్యక్షుడు డేవ్‌ కామెరూన్‌కు భారత బోర్డు తాజాగా మరో లేఖ రాసింది. 
 
వారం రోజుల్లోగా ఈ లేఖపై కరీబియన్‌ బోర్డు స్పందించకపోతే చట్టపరమైన చర్యలకు దిగనున్నట్టు స్పష్టం చేసింది. పరస్పర ఆమోద్యయోగ్యమైన పరిష్కారం కోసం గత యేడాది అక్టోబర్‌ 31వ తేదీన బీసీసీఐ రాసిన లేఖపై విండీస్‌ 40 రోజుల సమయం కోరింది. ఆ సమయం మించి చాలా రోజులు గడచినా.. పరిష్కారానికి చొరవ చూపలేదని ఈనెల 20న రాసిన తాజా లేఖలో బీసీసీఐ కార్యదర్శి సంజయ్‌ పటేల్‌ గుర్తు చేశాడు. 

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

Show comments