Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాలో గుజరాతి చిన్నోడు అక్షర్ పటేల్‌కు చోటు!

Webdunia
బుధవారం, 15 అక్టోబరు 2014 (13:54 IST)
యువ ఆల్ రౌండర్, గుజరాతి చిన్నోడు అక్షర్ పటేల్‌కు టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగే ఆఖరి రెండు వన్డేలతో పాటు విండీస్‌తో జరిగే ఏకైక ట్వంటీ-20లో ఆడే జట్టును బీసీసీఐ ప్రకటించింది. 
 
స్టీల్ సిటీ విశాఖలో జరగాల్సిన మూడోవన్డే హుదుద్ తుపాను దెబ్బతో రద్దయిన వెంటనే సిరీస్‌లోని మిగిలిన రెండు వన్డేల్లో పాల్గొనే భారతజట్టు వివరాలను సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. 
 
చాంపియన్స్ లీగ్‌లో నిలకడగా రాణించిన గుజరాత్ కమ్ కింగ్స్ పంజాబ్ స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌కు భారతజట్టులో చోటు కల్పించారు.
 
సిరీస్‌కు ముగింపుగా కటక్ బారాబటీ స్టేడియంలో ఈనెల 22న జరిగే సింగిల్ టీ-20 సమరంలో పాల్గొనే భారతజట్టులో ..డాషింగ్ బ్యాట్స్ మన్ మనీష్ పాండేకు చోటు కల్పించారు.
 
వెస్టిండీస్‌తో సిరీస్‌లో భాగంగా నాలుగో వన్డే ఈనెల 17న హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరుగుతుంది. ఆఖరి వన్డేకు భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ ఈనెల 20న ఆతిథ్యమిస్తుంది. 
 
జట్టు వివరాలు : ధోనీ కెప్టెన్సీలోని భారతజట్టు ఇతర సభ్యుల్లో శిఖర్ ధావన్, అజంక్యా రహానే, విరాట్ కొహ్లీ, రైనా, బిన్నీ జడేజా, అక్షర్ పటేల్, కరణ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, సంజు శాంప్సన్, మనీష్ పాండే, ఉమేశ్ యాదవ్ ఉన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments