Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాలో పిచ్‌లు ముందులా లేవు: రాహుల్ ద్రవిడ్

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (12:46 IST)
ఆస్ట్రేలియాలో పిచ్‌లు ముందులా లేవని, కాస్త మందగించాయని బ్యాటింగ్ లెజెండ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. భారత్‌తో తాజా టెస్టు సిరీస్‌లో ఆ విషయం వెల్లడైందని, పిచ్‌లు పేస్‌కు పెద్దగా సహకరించలేదని వివరించాడు.
 
ఇప్పుడున్న విధంగానే స్పిన్‌కు అనుకూలిస్తే వరల్డ్ కప్‌లో టీమిండియాకు లాభిస్తుందని విశ్లేషించాడు. ఈ సిరీస్ లో బౌన్స్ కూడా కనిపించలేదని అన్నాడు. ఈ నేపథ్యంలో, భారత్ తన బౌలింగ్ కూర్పులో ముగ్గురు స్పిన్నర్లకు కూడా చోటు కల్పించవచ్చని తెలిపాడు. 
 
వరల్డ్ కప్‌లో ఆయా జట్ల విజయావకాశాల గురించి చెబుతూ, ఆతిథ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో పాటు దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్ జట్లకు 60 నుంచి 70 శాతం వరకు కప్ నెగ్గే చాన్సులున్నాయని అభిప్రాయపడ్డాడు.
 
ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా క్వార్టర్ ఫైనల్స్ చేరుతుందని ధీమాగా చెప్పాడు. ఆ తర్వాత 'మూడు మంచిరోజులు' మనవైతే కప్ కూడా మనదవుతుందని అన్నాడు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments