Webdunia - Bharat's app for daily news and videos

Install App

400 వికెట్లు.. 4000 పరుగులపై కన్నేసిన వెట్టోరి!

Webdunia
సోమవారం, 29 మార్చి 2010 (12:52 IST)
న్యూజిలాండ్ కెప్టెన్ డేనియల్ వెట్టోరి తన మనస్సులోని మాటను వెల్లడించాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో 400 వికెట్లను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు నాలుగు వేల పరుగులను పూర్తి చేయాలన్నదే అంతిమ లక్ష్యమని వెట్టోరి ప్రకటించారు. ఈ అరుదైన రికార్డును హర్యానా హరికేన్, భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ మాత్రమే సాధించారు. ఈ రికార్డును అధికమించాలన్నది తన లక్ష్యంగా వెట్టోరి చెప్పాడు.

ఇందుకోసం మరో నాలుగేళ్ళ పాటు టెస్టు క్రికెట్‌ ఆడనున్నట్టు తెలిపారు. 31 సంవత్సరాల వెట్టోరి ప్రస్తుతం తన కెరీర్‌లో వందో టెస్టును ఆడుతున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు వెట్టోరికి వందో టెస్టు కావడం గమనార్హం.

దీనిపై వెట్టోరి మాట్లాడుతూ.. నాకు 35 సంవత్సరాలు వచ్చేంత వరకు టెస్టు క్రికెట్ ఆడాలన్నదే నా కోరిక. ఇందుకోసం తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటానని చెప్పాడు. అయితే, బలవంతంగా క్రికెట్ నుంచి వైదొలగాల్సి వస్తే అది పరిమిత ఓవర్ల క్రికెట్ కావచ్చన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

Show comments