Webdunia - Bharat's app for daily news and videos

Install App

3-0 ఆధిక్యంతో సిరీస్ భారత్ కైవసం

Webdunia
FileFILE
హామిల్టన్‌లో జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలుపొందడంతో... భారత్ 3-0 ఆధిక్యంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. వర్షం మళ్లీ అడ్డంకిగా నిలవడంతో డెక్‌వర్త్ లూయిస్ పద్ధతిని ఆశ్రయించక తప్పలేదు. ఈ పద్ధతి ప్రకారం 23.3 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 177 పరుగులు చేయగా.. భారత్ 201 పరుగు చేసింది.

దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపొందినట్లుగా ప్రకటించారు. అంతకుముందు... న్యూజిలాండ్ 270 పరుగులను చేసి భారత్‌కు సవాలు విసిరింది. అయితే వర్షం అడ్డంకిగా నిలవడంతో లక్ష్యాన్ని కుదించారు. విజయలక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు న్యూజిలాండ్ బౌలర్ల భరతం పట్టారు.

సెహ్వాగ్ 125 పరుగులు, గంభీర్ 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వర్షం మళ్లీ మొదలైంది. అప్పటికి భారత్ మొత్తం 13 ఎక్స్‌ట్రాలతో కలిపి 201 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు ధాటిగా ఆడటంతో ఓవర్‌కు 8.55 రన్‌రేట్ ఏమాత్రం తగ్గకుండా వచ్చింది. కాగా, ఈ మ్యాచ్‌లో భీకర బ్యాటింగ్‌తో చెలరేగిన సెహ్వాగ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

అలాగే సెహ్వాగ్ ఈ మ్యాచ్‌లో కేవలం 60 బంతుల్లో సెంచరీ నమోదు చేసి రికార్డు సృష్టించాడు. దీంతో గతంలో అజారుద్దీన్ పేరిట ఉన్న 62 బంతుల్లో వంద పరుగులు చేసిన రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Show comments