Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో హోండా వన్డే సిరీస్ ఆస్ట్రేలియా కైవసం

Webdunia
ఆదివారం, 8 నవంబరు 2009 (16:52 IST)
అనుకున్నట్టుగానే జరిగింది. స్వదేశంలో జరిగిన ఏడు మ్యాచ్‌లో హీరోహోండా వన్డే సిరీస్‌ను పర్యాటక ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం అస్సోం రాష్ట్ర రాజధాని గౌహతిలో జరిగిన ఆరో మ్యాచ్‌లో ఆసీస్ జట్టు భారత్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ఏడు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-2 తేడాతో కైవసం చేసుకుంది.

ఈనెల 11వ తేదీన ముంబైలో జరుగనున్న చివరి మ్యాచ్ నామమాత్రంగా మిగిలింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్ బౌలర్ల ధాటికి భారత్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఒక దశలో వంద పరుగులకే ఆలౌట్ అయ్యే సూచనలు కనిపించాయి.

అయితే, ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరచిన రవీంద్ర జడేజా (56), ప్రవీణ్ కుమార్ (54 నాటౌట్) పుణ్యమాని 48 ఓవర్లలో 170 పరుగుల వద్ద ధోనీ సేన ఆలౌట్ అయింది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 41.5 ఓవర్లలో 172 పరుగులు సాధించి విజయకేతనం ఎగురవేసింది. ఐదు వికెట్లు తీసి భారత బ్యాటింగ్ వెన్నువిరిచిన ఆసీస్ పేసర్ బోలింగర్‌‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments