Webdunia - Bharat's app for daily news and videos

Install App

హామిల్టన్ టెస్టు: ఫ్రాంక్లిన్‌కు కివీస్ జట్టులో స్థానం!

Webdunia
FILE
హామిల్టన్‌లో ఆస్ట్రేలియాతో శనివారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో పాల్గొనే న్యూజిలాండ్ జట్టులో ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఫ్రాంక్లిన్‌కు సెలక్టర్లు స్థానం కల్పించారు.

రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా, మంగళవారంతో ముగిసిన తొలి టెస్టులో కివీస్‌ను పది వికెట్ల తేడాతో మట్టికరిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో టెస్టులోనైనా కివీస్ ధీటుగా రాణించాలనే ఉద్దేశంతో సెలక్షన్ కమిటీ జట్టులో మార్పులు చేర్పులు చేసింది.

ఇందులో భాగంగా.. ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఫ్రాంక్లిన్‌కు చోటు కల్పించింది. ఫ్రాంక్లిన్ బౌలింగ్ నైపుణ్యంతో ఆసీస్ బ్యాట్స్‌మెన్లకు బ్రేక్ వేయవచ్చునని కివీస్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ విషయమై కివీస్ కోచ్ మార్క్ గ్రేట్‌బ్యాచ్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఓడిపోవడం ద్వారా కివీస్ క్రికెటర్లకు విభిన్న అనుభూతి కలిగిందన్నాడు. ఇంకా జేమ్స్ రాకతో రెండో టెస్టులో ఆడే జట్టులో నూతనోత్సాహం చోటు చేసుకునే అవకాశం ఉందని కోచ్ చెప్పాడు.

ఇందులో భాగంగా 14 మందితో కూడిన కివీస్ టెస్టు జట్టులో బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్‌సన్, మాథ్యూ సిన్‌క్లేర్‌లకు చోటు కల్పించినట్లు చెప్పారు. ఇంకా మాథ్యూ సిన్‌క్లేర్‌ను నెం.3లో కొనసాగిన పీటర్ ఇన్‌గ్రామ్ స్థానానికి ఎంపిక చేసినట్లు కోచ్ వివరించారు.

జట్టు వివరాలు: డానియల్ వెటోరి (కెప్టెన్), బ్రెంట్ ఆర్నెల్, మార్టిన్ గుప్తిల్, పీటర్ ఇన్‌గ్రామ్, బ్రెండాన్ మెక్‌కల్లమ్, టిమ్‌మెక్‌ఇన్‌తోష్, క్రిస్ మార్టిన్, జీతన్ పటేల్, మాథ్యూ సిన్‌క్లేర్, టిమ్ సౌథీ, రాస్ టాయిలర్, వాట్లింగ్, కేన్ విలియమ్‌సన్, జేమ్స్ ఫ్రాంక్లిన్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

Show comments