Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వదేశీ జట్టుపైనే ఫ్లింటాఫ్ మమకారం

Webdunia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడటంకంటే.. దేశానికి ప్రాతినిధ్యం వహించడమనేదే తనకు ముఖ్యమని ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు ఆండ్ర్యూ ఫ్లింటాఫ్ స్పష్టం చేశాడు. ఇప్పటికే ఫ్లింటాఫ్ ఐపీఎల్‌కు దూరం కానున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఫ్లింటాఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తుంటి గాయంతో బాధపడుతున్న ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ ఫ్లింటాఫ్ ప్రస్తుతం... వెస్టిండీస్-ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ మధ్యలో స్వదేశానికి వెనుదిరిగి వచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగే యాషెష్ సిరీస్‌కు పూర్తి ఫిట్‌‍నెస్‌తో ఉండేందుకుగానూ.. తాను ఐపీఎల్‌కు దూరం అయ్యేందుకు కూడా వెనుకాడనని ఫ్లింటాఫ్ తేల్చి చెప్పాడు.

ఇదిలా ఉంటే... ఐపీఎల్‌లోని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ, ఫ్లింటాఫ్‌ను 1.55 మిలియన్ డాలర్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసిన సంగతి విదితమే. అయితే... త్వరలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్ జట్టులోకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని ఫ్లింటాఫ్ చెబుతున్నాడు.

ఈ సందర్భంగా ఫ్లింటాఫ్ మాట్లాడుతూ... ఇప్పుడు అందరూ ఐపీఎల్ గురించే మాట్లాడుతున్నారనీ, ప్రస్తుతం ఇదొక హాట్ టాపిక్‌గా మారిపోయిందనీ వ్యాఖ్యానించాడు. తాను మాత్రం వచ్చే వన్డే సిరీస్‌లో సొంత జట్టులో ఆడేందుకే ఇష్టపడుతానని చెప్పాడు. ఐపీఎల్‌కు ఇంకొన్ని వారాల సమయం ఉంది కాబట్టి, ఆ విషయంపై తరువాత ఆలోచిస్తాననీ... తనకు ఫిట్‌నెస్ అనుకూలిస్తే మాత్రం మార్చి 10న ఇంగ్లండ్ జట్టులోకి వస్తానని ఫ్లింటాఫ్ ధీమాగా చెబుతున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నపిల్లలతో వెళుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక జేబుకు చిల్లే

Loan app: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు.. అశ్లీల, నగ్న చిత్రాలను షేర్ చేశారు.. చివరికి?

వోక్సెన్ యూనివర్శిటీ హాస్టల్‌లో ఉరేసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థి.. కారణం?

Life: జీవితంలో ఇలాంటి ఛాన్స్ ఊరకే రాదు.. వస్తే మాత్రం వదిలిపెట్టకూడదు.. (video)

యువతిని కత్తితో బెదిరించి యేడాదిగా వృద్ధుడి అత్యాచారం...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

Show comments