Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వదేశమే సురక్షిత ప్రాంతం : టెండూల్కర్

Webdunia
పరాయి దేశాలతో పోల్చినట్లయితే... స్వదేశంలోనే సురక్షితంగా ఉండగలుగుతామని భారత బ్యాటింగ్ ధిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. భారత్‌లో ఉండటాన్ని తాను గర్వంగా భావిస్తున్నాననీ.. విదేశాలకంటే, స్వదేశంలోనే తమకు పూర్తి రక్షణ ఉంటుందన్నాడు.

శ్రీలంక క్రికెట్ జట్టుపై పాక్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిపై స్పందించిన సచిన్ మాట్లాడుతూ... లంక జట్టుకు తన సానుభూతిని తెలియజేశాడు. లంక క్రికెటర్లలో చాలామందితో తనకు స్నేహం ఉందనీ, దాడిలో గాయపడ్డ వారందరూ త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్‌లో ఉండే భద్రతా ఏర్పాట్లు తమను సురక్షితంగా ఉంచుతాయనీ, ఇతర దేశాలలో తాము స్వేచ్ఛగా తిరగలేమని సచిన్ ఈ సందర్భంగా చెప్పాడు.

లంక ఆటగాళ్లపై జరిగిన ఉగ్రవాదుల దాడి తనను కలచివేసిందనీ, ఆ షాక్ నుంచి తేరుకునేందుకు చాలా సమయం పట్టిందని మాస్టర్ వ్యాఖ్యానించాడు. ఉగ్రవాదుల దాడి పాక్ క్రికెట్‌పై తీవ్రంగా ప్రభావం చూపించడం ఖాయమనీ... ఇంత జరిగాక ఏ దేశ క్రికెట్ జట్టయినా అక్కడ ఆడేందుకు ఇష్టపడదనీ ఆయన పేర్కొన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Show comments