Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైమండ్స్ లోటుతో దెబ్బతిన్న సమతూకం: రికీ

Webdunia
తమ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్‌ లోటుతో జట్టు సమతూకం దెబ్బతిన్నదని ఫలితంగా తాము విఫలమైనట్టు ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. జట్టు నుంచి సైమండ్స్‌ను తొలగించిన ప్రభావం తమపై చూపిందన్నాడు.

ఇంగ్లండ్‌లో జరుగుతున్న ట్వంటీ-20 ప్రపంచ కప్‌ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు గ్రూపు దశ నుంచి ఇంటిముఖం పట్టిన విషయం తెల్సిందే. తొలుత వెస్టిండీస్ చేతిలోనూ, ఆ తర్వాత శ్రీలంక చేతిలో ఓటమిపాలై, టోర్నీ నుంచి నిష్క్రమించింది.

దీనిపై పాంటింగ్ మాట్లాడుతూ.. తమ జట్టు కూర్పుకూడా తీవ్ర నిరాశకు లోను చేసింది. ఏ తరహా క్రికెట్ ఫార్మెట్‌లో తీసుకున్నప్పటికీ, ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపుపొందిన ఆటగాడిని జట్టు కోల్పోవడం ఏ జట్టుకైనా తీరని నష్టం కలిగిస్తుందన్నారు. అంతేకాకుండా, టోర్నీలో సమిష్టిగా రాణించలేక పోయామన్నారు.

దీన్ని సాకుగా మేం చెప్పదలచుకులేదన్నారు. ఏపుడైతే ఒక మంచి ఆటగాడిని కోల్పోతారో.. ఆ ప్రభావం జట్టుపై తప్పకుండా పడుతుందన్నారు. అందుకే తామాడిన రెండు మ్యాచ్‌లలో పరాయజం పాలైనట్టు రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు.

జట్టు క్రమశిక్షణను ఉల్లఘించినందుకు గాను ఆండ్రూ సైమండ్స్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా వేటు వేసి, స్వదేశానికి పంపించింది. టోర్నీ ఆరంభానికి ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడంతో ఆస్ట్రేలియాపై తీవ్ర ప్రభావం చూపింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments