Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఏ కాంట్రాక్టుల జాబితా: బ్రాకెన్, క్లార్క్, హస్సీలు అవుట్!

Webdunia
FILE
క్రికెట్ ఆస్ట్రేలియా 2010-2011 కాంట్రాక్ట్ జాబితాలో ఫాస్ట్ బౌలర్లు నాథన్ బ్రాకెన్, స్టువర్ట్ క్లార్క్, బ్యాట్స్‌మెన్ బ్రాడ్ హడ్జ్, డేవిడ్ హస్సీల పేర్లు కనుమరుగయ్యాయి. క్రికెట్ ఆస్ట్రేలియా నూతన కాంట్రాక్టు జాబితా వివరాలను బుధవారం ప్రకటించింది. ఇందులో బ్రాకెన్, స్టువర్క్ క్లార్క్, హడ్జ్ హస్సీలతో పాటు వికెట్ కీపర్ గ్రహమ్ మాన్యూ పేరును కూడా తొలగించారు.

25 మంది క్రీడాకారులతో కూడిన ఈ కాంట్రాక్టు జాబితాలో పై ఐదుగురు ఆటగాళ్ల పేర్లను తొలగించినట్లు సీఏ తెలిపింది. వీరికి బదులు పేస్ బౌలర్లు రియాన్ హారిస్, క్లింట్ మెక్‌కే, వికెట్-కీపర్ బ్యాట్స్‌మెన్ టిమ్ పైనీ, ఆల్-రౌండర్ స్టీవెన్ స్మిత్, ఆడమ్ వోగ్స్‌ల పేర్లను జాబితాలో చేర్చినట్లు సీఏ ప్రకటించింది.

ఇకపోతే... స్టార్ ఆటగాడు బ్రెట్ లీ గాయాల నుంచి మెల్లమెల్లగా కోలుకుని ఐపీఎల్‌లో ఆడుతున్న కారణంగా అతని పేరును కూడా సీఏ జాబితాలో చేర్చింది. ఇతనితో పాటు షాన్ టైట్ కూడా సీఏ కాంట్రాక్టు లిస్టులో స్థానం సంపాదించుకున్నాడు.

కాగా.. సీఏ కాంట్రాక్టు జాబితా నుంచి తమ పేర్లను తొలగించడంపై స్టువర్ట్ క్లార్క్, నాథన్ బ్రాకెన్‌లు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టువర్ట్, నాథన్‌లకు మంచి రికార్డులున్నప్పటికీ వారి పేర్లను జాబితాలో చేర్చకపోవడం సరైన నిర్ణయం కాదని భావిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments