Webdunia - Bharat's app for daily news and videos

Install App

షోయబ్ తప్పుడు "తలాక్": మొదటికొచ్చిన పెళ్లి కథ

Webdunia
PTI
షోయబ్ మైండ్ సెట్ ఏమిటో... ఎవరికీ ఓ పట్టాన అర్థం కావడం లేదు. సానియా మీర్జాతో పెళ్లికి లైన్ క్లియర్ అవ్వాలనే ఉద్దేశ్యంతో పెద్ద మనుషుల మధ్యవర్తిత్వం ద్వారా అయేషా సిద్ధీఖీకి లిఖితపూర్వకంగా షోయబ్ తలాక్ చెప్పాడు. అయితే ఈ తలాక్ విషయంలో షోయబ్ మరోసారి తన మోసపూరితమైన బుద్ధిని చూపించాడు.

తలాక్ పత్రంలో తండ్రి పేరును మాలిక్ ఫకీర్ హుస్సేన్‌కు బదులుగా మాలిక్ సలీం హుస్సేన్‌గా మార్చి రాశాడు. నిజం నిప్పులాంటిది కనుక వెంటనే తేలిపోయింది. తన పెళ్లి ఆహ్వాన పత్రికలో తన తండ్రి పేరును సరియైనదిగా సూచించి విడాకుల పత్రంలో ఇలా మార్చి ఎందుకు రాశాడనేది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని తేల్చుకునేందుకు అయేషా కుటుంబం మరోసారి రంగంలోకి దిగింది. మొత్తమ్మీద షోయబ్ తప్పుడు సమాచారం కారణంగా విడాకులు చెల్లవని ఖాజీ పెద్దలు చెప్పినట్లు సమాచారం.

ఈ పరిణామంతో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పెళ్లి కథ మళ్లీ మొదటికొచ్చినట్లయింది. మరోవైపు రోజుకో సమస్యతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న షోయబ్ గొడవ ఎలా వదిలించుకోవాలో అర్థంకాక సానియా కుటుంబం తల పట్టుకున్నట్లు సమాచారం. ఇంకోవైపు నిఖా చేయాల్సిన రోజు ఏప్రిల్ 15 సమీపిస్తోంది. అయితే సమస్యల మీద సమస్యలు చుట్టుముడుతున్న తరుణంలో సానియా వివాహం ఏప్రిల్ 15న జరుగుతుందా..? వాయిదా పడుతుందా... అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments