Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్మప్ మ్యాచ్: ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన భారత్

Webdunia
నార్తాంప్టన్‌షైర్‌తో శుక్రవారం ప్రారంభమైన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్(8), గౌతమ్ గంభీర్ వికెట్లను త్వరగా కోల్పోయింది. భారత్ 28 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. అభినవ్ ముకుంద్(42), వీవీఎస్ లక్ష్మణ్(14)లు క్రీజ్‌లు ఉన్నారు.

అంతకు ముందు స్టాండిన్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆడుతున్నప్పటికీ ఓపెనర్ గంభీర్ నాయకత్వం వహిస్తున్నాడు. వృద్ధిమాన్ సాహా జట్టులో ఉన్నందున ధోనీ ఎక్కువ సేపు కీపింగ్ చేసే అవకాశం లేదు.

మూడో టెస్ట్‌కు ముందు జరుగుతున్న ఈ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్‌, గంభీర్‌లపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ మ్యాచ్‌కు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, ప్రవీణ్ కుమార్‌లకు విశ్రాంతి కల్పించారు. ఆగస్ట్ 10 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభమయ్యే కీలకమైన మూడో టెస్ట్‌లో ఈ ముగ్గురు ఆటగాళ్లు ప్రధానం.

రోజుకు 90 ఓవర్ల పాటు జరిగే ఈ మ్యాచ్‌‌లో ఒక్కో జట్టు వంద ఓవర్ల పాటు ఆడుతుంది. 12 మంది ఆటగాళ్లు జట్టులో ఉంటారు.

జట్టు వివరాలు:

భారత్: గౌతం గంభీర్(కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, అభినవ్ ముకుంద్, మహేంద్ర సింగ్ ధోనీ, వీవీఎస్ లక్ష్మణ్, సురేష్ రైనా, వృద్ధిమాన్ సాహా, శ్రీశాంత్, జహీర్ ఖాన్, అమిత్ మిశ్రా, మునాఫ్ పటేల్, ఇషాంత్ శర్మ.

నార్తాంప్టన్‌షైర్: ఎంబీ లోయే, ఎన్‌జే ఓబ్రియాన్, ఆర్‌ఏ వైట్, ఆర్ఐ న్యూటన్, డీజేజీ సేల్స్, డీజే విల్లీ, డీ మర్ఫీ, పీఎం బెస్ట్, డీ బర్టన్, ఎల్ఎం డగ్గెట్, ఎల్ ఇవాన్స్, టీ బ్రెట్.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments