Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాతావరణం అనుకూలించాలి: మెక్‌కల్లమ్ ప్రార్థన

Webdunia
వెల్లింగ్టన్‌లో భారత్‌తో జరుగనున్న మూడో టెస్టుకు వాతావరణం అనుకూలించాలని న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెక్ కల్లమ్ దేవుడిని ప్రార్థించాడు. శుక్రవారం (ఏప్రిల్ 3) ప్రారంభం కానున్న ఈ టెస్టు మ్యాచ్‌కు మంచు, వర్షంతో అంతరాయం కలుగకూడదంటూ కల్లమ్ మొక్కుకున్నాడు.

వాతావరణం అనుకూలిస్తే పిచ్‌లపై తమ ఆటగాళ్లు ధీటుగా రాణిస్తారని మెక్ కల్లమ్ పేర్కొన్నాడు. భారత్‌తో నేపియర్‌లో జరిగిన రెండో టెస్టు లాగానే ఈ టెస్టులోనూ బౌలర్లు బాగా ఆడతారని ధీమా వ్యక్తం చేశారు. హామిల్టన్ టెస్టు తర్వాత తమ జట్టులో కొత్త ఉత్సాహం వచ్చిందని, మూడో టెస్టును తప్పకుండా జట్టు కైవసం చేసుకునే దిశగా ఆటగాళ్లు సమిష్టిగా కృషి చేస్తారని మెక్ కల్లమ్ నమ్మకం వ్యక్తం చేశాడు.

ఓపెనర్లు నిలకడగా, నేర్పుతో ఆడాలని లేని పక్షంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లపై భారం పడే అవకాశం ఉందని కల్లమ్ అభిప్రాయపడ్డాడు. అందుచేత బ్యాట్స్‌మన్లు, బౌలర్లు ప్రత్యర్థి జట్టు ఆటతీరుకు అనుకూలంగా గట్టీపోటీని ప్రదర్శించాల్సి ఉంటుందన్నాడు.

తొలి రెండు టెస్టు మ్యాచ్‌లలో అంతగా రాణించలేక పోయిన టిమ్ నుంచి మూడో టెస్టులో మంచి ప్రదర్శనను ఆశించవచ్చునని కల్లమ్ అన్నాడు. మైదానంలో బౌలర్లను ధీటుగా ఎదుర్కొనేందుకు టిమ్ తీవ్రంగా కృషి చేస్తున్నాడని చెప్పాడు. కివీస్ జట్టు మంచి ఫామ్‌లో ఉందని మెక్ కల్లమ్ పేర్కొన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments