Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే సిరీస్‌కు సిద్ధంకండి : ధోనీ

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2009 (11:45 IST)
రెండు మ్యాచ్‌ల ట్వంటీ20 అంతర్జాతీయ టోర్నీలో న్యూజిలాండ్ చేతిలో పరాభవం ఎదుర్కొన్న నేపథ్యంలో... ఓడిపోయామని బాధపడుతూ కూర్చోవద్దనీ... ముందున్న ఐదు వన్డేల సిరీస్‌కు సన్నద్ధం కావాలని టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన సహచరులకు పిలుపునిచ్చాడు.

మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ... ట్వంటీ20 మ్యాచ్‌లు కివీస్‌లోని పిచ్‌లు, ఇక్కడి పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్ల బలాబలాలపై తమకు మంచి అవగాహనను కల్పించాయన్నాడు. రెండు మ్యాచ్‌లు ఓడిపోయామని విచారిస్తూ కూర్చోవడంలో ఎలాంటి అర్థమూ లేదనీ... వన్డే సిరీస్‌పై తమ దృష్టి నిలిపామని అన్నాడు.

టీం ఇండియా సన్నాహకాలపై సంతోషంగానే ఉన్నాననీ... ట్వంటీ20లో తమ ప్రదర్శన బాగుందనీ ధోనీ వ్యాఖ్యానించాడు. చాలామంది తమ కుర్రాళ్లు క్రీజులో తగినంత సమయం గడిపారనీ... ఇక్కడి పిచ్‌లు ఎలా స్పందిస్తున్నాయన్నది వారికి బాగా అర్థమైందని, ఇది వన్డే సిరీస్‌లో ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పాడు. కివీస్ కంటే మెరుగైన బ్యాటింగ్ లైనప్ టీం ఇండియాకు ఉందని ధోనీ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే... గాయపడ్డ పేసర్ ఇషాంత్ శర్మ వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా, లేదా అన్న విషయమై ఇప్పుడేమీ చెప్పలేమని ధోనీ వెల్లడించాడు. గాయం తీవ్రతను ఇంకా నిర్ధారించాల్సి ఉందనీ, వైద్య పరీక్షల అనంతరం ఓ నిర్ణయానికి వస్తామని చెప్పాడు. కాగా, శుక్రవారం రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో బంతిని ఆపేందుకు డైవ్ చేసినప్పడు ఇషాంత్ కుడి భుజానికి గాయమైన సంగతి తెలిసిందే...!
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు- ప్రజలు అప్రమత్తంగా వుండాలి.. ఐఎండీ హెచ్చరిక

చిన్నపిల్లలతో వెళుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక జేబుకు చిల్లే

Loan app: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు.. అశ్లీల, నగ్న చిత్రాలను షేర్ చేశారు.. చివరికి?

వోక్సెన్ యూనివర్శిటీ హాస్టల్‌లో ఉరేసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థి.. కారణం?

Life: జీవితంలో ఇలాంటి ఛాన్స్ ఊరకే రాదు.. వస్తే మాత్రం వదిలిపెట్టకూడదు.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

Show comments