Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటి ఐపీఎల్ సమావేశానికి లలిత్ మోడీ హాజరు!

Webdunia
ఆదివారం, 25 ఏప్రియల్ 2010 (17:58 IST)
PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పాలక మండలి సమావేశానికి ఆ లీగ్ కమిషనర్ లలిత్ మోడీ హాజరుకానున్నారు. ఈ భేటీ సోమావరం ముంబైలో జరుగనుంది. ఐపీఎల్ వ్యవహారంపై చర్చించేందుకు భేటీ అయ్యే సమావేశంలో లలిత్ మోడీ పాల్గొనాలని నిర్ణయించడం గమనార్హం.

ఐపీఎల్ టోర్నమెంట్‌ నిర్వహణలో నిధుల దుర్వినియోగంతో పాటు బెట్టింగ్‌లకు పాల్పడినట్టు లలిత్ మోడీపై ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఛైర్మన్‌గా లలిత్ మోడీని తొలగించాలని డిమాండ్లు జోరుగా వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న పాలక మండలి సమావేశానికి ఆయన కూడా హాజరుకానున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇదిలావుండగా, ఐపీఎల్ గవర్నింగ్ బాడీ సమావేశాన్ని నిర్వహించేందుకు బీసీసీఐకు అధికారం లేదని, అందువల్ల ఈ సమావేశంలో తాను పాల్గొనాలన్న నిబంధనేదే లేదని లలిత్ మోడీ ఇప్పటి వరకు వాదిస్తూ వచ్చారు.

అయితే, ఆకస్మికంగా ఆయన తమ మనస్సును మార్చుకున్నారు. తనపై మోపే ఆరోపణలను తెలుసుకునేందుకు గాను ఆయన ఈ సమావేశానికి హాజరుకావాలని మోడీ నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

6 నిమిషాల్లో 18 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను పట్టేసిన మహిళ (video)

టేస్ట్ అట్లాస్‌లో భాగ్యనగరికి చోటు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

Show comments