Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిటైర్‌మెంట్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: సచిన్

Webdunia
రిటైర్‌మెంట్ అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. ప్రస్తుతం పరుగుల మోతలో టీం ఇండియాను ఆదుకుంటోన్న సచిన్, అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పే అంశంపై ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించాడు.

ఇప్పటికే వన్డే, టెస్టుల్లో భారత్ తరపున ఆడి 29వేల పరుగులు సాధించిన సచిన్, ఇందులో.. 85 శతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటింగ్‌లో రాణిస్తూ, అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రిటైర్‌మెంట్ గురించి ఆలోచిస్తేనే బాధేస్తుందని సచిన్ అన్నాడు.

ఇంకా దేశం తరపున మైదానంలో గట్టిపోటీని ప్రదర్శించాలనుందని సచిన్ చెప్పాడు. తన క్రికెట్ కెరీర్‌లో ఎన్నో అనుభూతులను చవిచూశానని, ఇటీవల జరిగిన మ్యాచ్‌ల్లో ధీటుగా రాణించడం ఆనందంగా ఉందని మాస్టర్ బ్లాస్టర్ తెలిపాడు.

ఇదే ఆటతీరును కొనసాగించాలనుందని, క్రికెట్ అంటే తనకెంతో ఇష్టమని, రానున్న మ్యాచ్‌లలోనూ తనదైన శైలిలో రాణిస్తానని సచిన్ చెప్పాడు. మైదానంలో బ్యాట్‌తో బరిలోకి దిగే సమయంలో తనలో ఉద్వేగం పెరుగుతోందని, తనలో ఆ ఉద్వేగం కరువైనట్లు అనిపిస్తే వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెబుతానని సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

Show comments