Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిటైరయ్యేంతవరకు కేకేఆర్ తరపున ఆడుతా: గంగూలీ

Webdunia
PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తాను రిటైరయ్యేంత వరకు బాలీవుడ్ బాద్‌షా ఫ్రాంచైజీ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతానని బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. ఐపీఎల్-4లో పూణే ఫ్రాంచైజీ జట్టు తరపున బెంగాల్ టైగర్, టీం ఇండియా మాజీ కెప్టెన్, సౌరవ్ గంగూలీ ఆడుతాడని వెలువెత్తిన వార్తలను దాదా తోసిపుచ్చాడు.

ఇంకా ఎన్ని కొత్త ఫ్రాంచైజీ జట్లు పరిచయమైనా ఐపీఎల్‌లో రిటైర్ అయ్యేంతవరకు కేకేఆర్ తరపున ఆడుతానని సౌరవ్ స్పష్టం చేశాడు. అయితే తనకు ఇప్పట్లో రిటైరయ్యే ఆలోచన లేదని గంగూలీ తెలిపాడు.

ఇదిలా ఉంటే.. పూణే ఫ్రాంచైజీ జట్టు తరపున ఐపీఎల్-4లో సౌరవ్ ఆడుతాడని, ఇంకా త్వరలో రిటైర్మెంట్ కూడా ప్రకటించనున్నాడని వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలపై సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. పై వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నాడు. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న తాను రిటైర్మెంట్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాడు.

ఇంకా షారూఖ్ మాట్లాడుతూ.. గంగూలీ రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో లేదని, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే వంటి లెజండ్ క్రికెటర్ల తరహాలో ఐపీఎల్‌లో కొనసాగుతాడని తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Show comments