Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయల్ ఛాలెంజర్స్‌పై డెక్కన్ ఛార్జర్స్ హ్యాట్రిక్ విజయం!

Webdunia
PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్ హ్యాట్రిక్ విజయంతో సెమీఫైనల్ అవకాశాలను సజీవం చేసుకుంది. సోమవారం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన 46వ లీగ్ మ్యాచ్‌లో డెక్కన్ ఛార్జర్స్ 13 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన డెక్కన్ ఛార్జర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల పతనానికి 151 పరుగులు సాధించింది. తదనంతరం 152 పరుగుల లక్ష్యంతో క్రీజులోకి దిగిన బెంగళూర్‌ 19.4 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది.

బెంగళూరు ఆటగాళ్లలో హారిస్‌ తొలి బంతికే అవుట్ కావడంతో ప్రారంభంలోనే కష్టాల్లో పడింది. అయితే ద్రావిడ్, కలిస్‌ల ఇన్నింగ్స్‌తో బెంగళూరు లక్ష్యంగా దిశగా సాగినట్లు కనిపించింది.

కీలక ఇన్నింగ్స్‌ ఆడిన ద్రావిడ్‌ 35 బంతుల్లో 8ఫోర్లతో49 పరుగులు చేయగా, కలిస్‌ 27 పరుగులతో పెవిలియన్ చేరాడు. కానీ బెంగళూరు వెంట వెంటనే వికెట్లను చేజార్చుకోవడంతో.. కుంబ్లే సేనకు ఓటమి తప్పలేదు. ఇకపోతే.. ఛార్జర్స్‌ బౌలర్లలో హారిస్‌, ఆర్పీ సింగ్‌, ఓజా, హర్మిత్‌ సింగ్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. సైమండ్స్‌కు ఒక వికెట్‌కు దక్కింది.

అలాగే బెంగళూరు బౌలర్లలో స్టెయిన్ మూడు వికెట్లు పడగొట్టగా, వినయ్ కుమార్, కుంబ్లే చెరో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. కాగా.. డెక్కన్ ఛార్జర్స్ బౌలర్ హర్మిత్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments