Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ నెగ్గేనా..?

Webdunia
PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా.. బుధవారం రాజస్థాన్ రాయల్స్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ల మధ్య సమరం జరుగనుంది. ఐపీఎల్ పట్టికలో పది పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

ఇప్పటికే వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్ నటీమణి ప్రీతి జింటా జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఐపీఎల్ పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. సెమీఫైనల్ ఆశలను చేతులారా పోగొట్టుకున్న పంజాబ్, ప్రతీ మ్యాచ్‌లో నెగ్గాలనే ఉద్దేశంతో తలపడుతోంది.

ఇందులో భాగంగా ఆదివారం జరిగిన 34వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ ఎనిమిది వికెట్ల తేడాతో గంగూలీ సేనను మట్టికరిపించింది. ఇదే ఊపుతో శిల్పాశెట్టి ఫ్రాంచైజీ జట్టు షేన్ వార్న్ సేన రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించాలని పంజాబ్ భావిస్తోంది.

అయితే ఐపీఎల్ 36వ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాదీ ఫ్రాంచైజీ జట్టు డెక్కన్ ఛార్జర్స్‌పై థ్రిల్ విజయాన్ని నమోదు చేసుకున్న రాజస్థాన్ రాయల్స్, పంజాబ్‌పై గట్టిపోటీని ప్రదర్శించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఇంకా షేన్ వాట్సన్ బ్యాటింగ్ రాజస్థాన్‌కు ప్రత్యేక బలమని వారు చెబుతున్నారు. దీనిని బట్టి రాజస్థాన్ రాయల్స్‌కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయన్నమాట..!.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Show comments