Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబయి ఇండియన్స్ కోచ్‌గా ప్రవీణ్ నియామకం

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2009 (09:56 IST)
38 వ రంజీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకోవడంలో ముంబయి జట్టును ముందుండి నడిపించి కీలకపాత్ర పోషించిన ప్రవీణ్ అమ్రే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని ముంబయి ఇండియన్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించబోతున్నారు. దక్షిణాఫ్రికాలో జరగబోతున్న ఐపీఎల్ రెండో సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు అమ్రేను కోచ్‌గా నియమించినట్లు జట్టు ఫ్రాంఛైజీ వెల్లడించింది.

ప్రారంభ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు టీం ఇండియా మాజీ ఓపెనర్ లాల్‌చంద్ రాజ్‌పుట్ కోచ్‌గా వ్యవహరించారు. ఆయన స్థానంలో మాజీ టెస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అమ్రేను నియమించామని ముంబయి ఇండియన్ ప్రతినిధి ఒకరు పీటీఐతో చెప్పారు. జట్టు ముఖ్య సలహాదారు, బౌలింగ్ కోచ్ షాన్ పొలాక్‌‍తో అమ్రే కలిసి పనిచేస్తారని చెప్పారు.

ముంబయి ఇండియన్స్‌కు జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. జట్టు ఐపీఎల్ రెండో సీజన్‌లో ఆడేందుకు ఏప్రిల్ 7న దక్షిణాఫ్రికా బయలుదేరి వెళ్లనున్నారు. అయితే న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న కెప్టెన్ సచిన్ టెండూల్కర్, ఇతర ప్రధాన ఆటగాళ్లు జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ధావల్ కులకర్ణి మాత్రం ఏప్రిల్ 9న బయలుదేరతారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments