Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ప్రపంచకప్‌ : పాక్ విజయం

Webdunia
ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్‌లో పాక్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండర్ ఖనితా జలీల్ అద్భుతమైన ఆటతీరుతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు సాధించింది. బ్యాట్స్‌ఉమన్ జలీల్ ధాటిగా ఆడి 19 పరుగులు సాధించగా... నైన్ ఆబిది 19, సనా మిర్ 22, సాజిదా సాహ్ 21, ఉరూజ్ 20 పరుగులు చేశారు.

ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు 104 పరుగులకే కుప్పగూలిపోయింది. లంక జట్టులోని స్కిప్పర్ శశికళ ఒంటరి పోరాటం చేసి 58 పరుగులు సాధించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. పాక్ బౌలర్లలో ఖనితా జలీల్ రెండు వికెట్లు, సనా రెండు వికెట్లు పడగొట్టి జట్టును విజయపథంలో నడిపించారు.

ఇదిలా ఉంటే... తొలి మ్యాచ్‌లో భారత జట్టు చేతిలో పది వికెట్ల ఘోర పరాజయం పాలయిన పాకిస్థాన్‌కు, ఈ వరల్డ్‌కప్‌లో తాజాగా లంకపై సాధించినది మొదటి విజయం కావడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

Show comments