Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా క్రికెట్: పాక్‌పై భారత్ విజయభేరీ

Webdunia
శనివారం, 7 మార్చి 2009 (13:40 IST)
ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రపంచ మహిళా క్రికెట్ కప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై మహిళా క్రికెటర్లు అద్భుతంగా రాణించి విజయం సాధించారు. టాస్ గెలిచిన కెప్టెన్ జులన్ గోస్వామి.. ప్రత్యర్థి పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత మహిళా బౌలర్లు ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో అద్భుతంగా బౌలింగ్ చేసి, 29 ఓవర్లలో కేవలం 57 పరుగులకే ప్రత్యర్థిని కట్టడి చేసింది.

న్యూబాల్ బౌలర్ రుమేలి ధర్ పాక్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చింది. ఎనిమిది ఓవర్లు వేసిన ధర్, ఏడు పరుగలు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసింది. వేసిన ఎనిమిది ఓవర్లలో ఐదు మేడిన్స్ ఓవర్లు కావడం గమనార్హం. అలాగే అమితా శర్మా (2/9), ప్రియాంకా రాయ్ (2/13)లు తమ వంతు సహకారం అందించడంతో పాకిస్థాన్ కుప్పకూలింది.

పాక్ జట్టులో సనా మిర్ 17 పరుగులు చేసి టాప్ స్కోరర్‌ కాగా, ఓపెన్ నైన్ అబిడి 11 పరుగులతో రెండంకెల స్కోరును చేరుకుంది. ఆ తర్వాత 58 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఓపెనర్లు అనగ దేశ్‌పాండ్, అంజుమ్ చోప్రాలు పది ఓవర్లలో విజయ లక్ష్యానికి కావల్సిన పరుగులు రాబట్టారు. దేశ్‌పాండ్ 37 బంతుల్లో 26 పరుగులు చేయగా, చోప్రా 23 బంతుల్లో 17 పరుగుల చేశారు. పాక్ బౌలర్లు మరో 15 పరుగులను ఎక్స్‌ట్రాల రూపంలో సమర్పించుకున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Show comments