Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ దూకుడుకు వరుణుడు అడ్డుకట్ట

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2009 (09:15 IST)
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం వెల్లింగ్టన్‌లో ప్రారంభమైన రెండో వన్డేకూ వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో భారత్ స్కోరు వికెట్ నష్టానికి 130 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం పడటంతో మ్యాచ్‌ను నిలిపి వేశారు. అంతకుముందు భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వరుసగా రెండో సారి టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

భారత ఓపెనర్లు కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. జట్టు స్కోరు 76 పరుగుల మీద ఉండగా, బుట్లర్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికే సెహ్వాగ్ 36 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో సుడిగాలి ఇన్నింగ్స్‌తో 54 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సచిన్ కూడా అదే ఊపును కొనసాగించి, అర్థ సెంచరీ సాధించాడు. సెహ్వాగ్ అవుట్‌తో క్రీజ్‌లోకి వచ్చిన గంభీర్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు.

19 వ ఓవర్ పూర్తయ్యే సమయానికి వర్షం పడటంతో భారత్ వికెట్ నష్టానికి 130 పరుగుల చేయగా, సచిన్ (59), గంభీర్ (13) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి వన్డేలో బరిలోకి దిగిన జట్టునే రెండో వన్డేలో కూడా కొనసాగించారు. ఇరు జట్ల వివరాలు..

భారత జట్టు.. సెహ్వాగ్, సచిన్, గంభీర్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, ధోనీ, పఠాన్, ప్రవీణ్ కుమార్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్.

కివీస్ జట్టు.. రైడర్, మెక్‌కల్లమ్, గుప్తిల్, టేలర్, ఇలియట్, ఓరమ్, మెక్‌గల్షన్, వెట్టోరి, బుట్లర్, ఒబ్రియన్, మిల్స్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Show comments