Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రియాన్ లారాను ఆడించేందుకు సర్రే యత్నం..!: రిపోర్ట్

Webdunia
FILE
వెస్టిండీస్ క్రికెట్ లెజండ్, రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెట్ స్టార్ బ్రియాన్ లారాను మళ్లీ క్రీజులోకి దించేందుకు ఇంగ్లాండ్ దేశవాళీ క్రికెట్ జట్టు సర్రే సాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. బ్రియాన్ లారాను సర్రే జట్టు తరపున ట్వంటీ-20 మ్యాచ్‌ల్లో ఆడించేందుకు ఆ టీమ్ యాజమాన్యం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

గత 2007వ సంవత్సరం కరేబియన్ గడ్డపై జరిగిన ప్రపంచకప్‌కు తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి పలికాడు. ఈ నేపథ్యంలో 41 ఏళ్ల బ్రియాన్ లారాను మళ్లీ క్రీజులోకి దింపాలని ఇంగ్లాండ్ కౌంటీ జట్టు సర్రే రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయమై బీబీసీ వెబ్‌సైట్‌కు సర్రే జట్టు విడుదల చేసిన ప్రకటనలో.. ఇంగ్లాండ్ కౌంటీ జట్టులో ఆడేందుకుగాను బ్రియాన్ లారా వద్ద జట్టు నిర్వాహకులు చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది.

మరోవైపు ఐపీఎల్ క్రికెట్‌లో పాల్గొంటారా? అనే ప్రశ్నకు బ్రియాన్ లారా సమాధానమిస్తూ.. ఐపీఎల్ క్రికెట్.. అంతర్జాతీయ క్రికెట్‌కు సవాలుగా పరిణమించిందని చెప్పాడు. అలాంటి ఛాలెంజింగ్ క్రీజులో ఆడటం సాధ్యం కాదని లారా వెల్లడించాడు. ఈ క్రమంలో కౌంటీ జట్టులో లారా ఆడుతాడా? లేదా? అనే అంశంపై సంశయం నెలకొంది.

ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సర్రే జట్టు త్వరలో బ్రియాన్ లారాను క్రీజులోకి దింపేందుకు ప్రయత్నిస్తోందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

Show comments