Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లింటాఫ్ ఉన్నా.. లేకున్నా యాషెస్ గెలవగలం

Webdunia
స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్ర్యూ ఫ్లింటాఫ్ అందుబాటులో ఉన్నా.. లేకున్నా ఇంగ్లండ్ ఈసారి యాషెస్ సిరీస్ నెగ్గగలదని ఆ జట్టు కెప్టెన్ స్ట్రాస్ చెప్పాడు. ప్రస్తుత యాషెస్ సిరీస్ అనంతరం ఫ్రెడ్డీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ టెస్ట్ కెరీర్ చరమాంకంలో ఉన్న ఫ్రెడ్డీ తమ జట్టుకు అందుబాటులో లేకున్నా సిరీస్ గెలుస్తామని స్ట్రామా ధీమా వ్యక్తం చేశాడు.

చాలా కాలంగా మెకాలి గాయంతో ఇబ్బందిపడుతున్న ఫ్లింటాఫ్ మూడో టెస్ట్ సందర్భంగా దానితో ఇబ్బంది పడ్డాడు. పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయలేకపోయాడు. అయినప్పటికీ ఫ్లింటాఫ్‌కు నాలుగో టెస్ట్ జట్టులో ఇంగ్లండ్ సెలెక్టర్లు చోటు కల్పించారు. సిరీస్‌లో నాలుగో టెస్ట్ శుక్రవారం లీడ్స్‌లో ప్రారంభం కానుంది. ఫ్లింటాఫ్ లేకుండా సిరీస్ గెలువగలరా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్ట్రాస్ బదులిస్తూ.. అతను లేకుండా కూడా ఇంగ్లండ్ గెలువగలదని తెలిపాడు.

గత రెండేళ్లలో అనేకసార్లు తాము ఈ విషయాన్ని నిరూపించామని పేర్కొన్నాడు. తమకు ఫ్లింటాఫ్ లేకపోవడం కొత్తేమీ కాదన్నాడు. ఫ్లింటాఫ్ అందుబాటులో లేని సమయంలో బౌలర్లు ప్రదర్శన మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సివుంటుంది. ఫ్లింటాఫ్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే మాత్రం తాము అతను లేకుండా ఆడేందుకు ఆస్కారం ఉండదని స్ట్రాస్ పేర్కొన్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments